Travis Head – Bumrah: బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదు టెస్ట్ ల సిరీస్ ముగిసింది. ఈ సిరీస్ ని ఆసీస్ 3 -1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ ఓటమితో భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కీ అర్హత సాధించే అవకాశాలను చేజార్చుకుంది. ఈ సిరీస్ లో హేమాహేమీలైన భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఐతే సిరీస్ మొత్తం పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియా అన్న రీతిలో సాగింది.
Also Read: WTC Cycle 2025-27 Schedule: WTC 2025-27లో టీమిండియా షెడ్యూల్ వచ్చేసింది ?
మొదటి టెస్ట్ కి కెప్టెన్ గా వ్యవహరించిన బుమ్రా భారత జట్టుకి అద్భుతమైన విజయాన్ని చేకూర్చాడు. ఈ సిరీస్ లో మొత్తం 12.64 సగటుతో 32 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియా ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్నప్పటికీ.. భారత పేస్ బౌలర్ బుమ్రాని తలుచుకొని మాత్రం భయపడిందట. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ స్వయంగా వెల్లడించారు.
గాయం కారణంగా బుమ్రా ఆఖరి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయలేదు. అయితే అతడి బౌలింగ్ లేకపోవడం వల్లే తమ గెలుపు సాధ్యమైందని అన్నాడు హెడ్. అతడు బౌలింగ్ చేయడం లేదని తెలిసి సంతోషించామని వ్యాఖ్యానించాడు. ఐదో టెస్ట్ అనంతరం బుమ్రా గురించి హెడ్ మాట్లాడుతూ.. “బుమ్రాకు ఇది ఓ అసాధారణ సిరీస్ గా మిగిలిపోతుంది. నా టెస్ట్ కెరీర్ లో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన బుమ్రాదే.
బుమ్రా లాంటి అత్యుత్తమ బౌలర్ ని ఎదుర్కొన్నామని భవిష్యత్తులో కధలు కథలుగా చెప్పుకుంటాం. చివరి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో బుమ్రా బౌలింగ్ చేయడం లేదనే విషయం తెలిసి డ్రెస్సింగ్ రూమ్ అంతా సంతోషంలో మునిగిపోయింది. మా జట్టులోని 15 మంది ఆటగాళ్లను బుమ్రా తన బౌలింగ్ తో భయపెట్టాడు. ఈ సిరీస్ లో బుమ్రా మాకు నరకం చూపించాడు. భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా అద్భుతంగా రాణించాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి ప్రతిభ గురించి నాకు తెలుసు.
Also Read: Chahal wife with iyer: చాహల్ తో విడాకులు.. అయ్యర్ తో ధనశ్రీ ఎంజాయ్.. ఫోటోలు వైరల్!
చివరి టెస్ట్ లో టార్గెట్ చిన్నది కావడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడాం. తలో 20, 30 పరుగులు చేసినా విజయం సాధించవచ్చని భావించాం. గత రెండు ఇన్నింగ్స్ లలో విఫలం కావడం తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో ఆఖరి ఇన్నింగ్స్ లో ఉస్మాన్ ఖవాజాతో కలిసి చిన్న భాగస్వామ్యాన్ని నెలకొల్పా. వెబ్ స్టర్ తో ఆ లయను కొనసాగించా. దీంతో మా గెలుపు సాధ్యమైంది” అని చెప్పుకొచ్చాడు హెడ్. ఇక ఈ సిరీస్ లో ట్రావీస్ హెడ్ 56 సగటుతో 448 పరుగులు చేసి.. హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ సిరీస్ లో 32 వికెట్లు తీసిన బుమ్రాకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరించిన విషయం తెలిసిందే.