CM Revanth Reddy: ఎట్టకేలకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం దీన్ని ప్రారంభించనున్నారు. హైదరాబాద్ సిటీలో ఈ వంతెన రెండో అతి పెద్దది. పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత ఇదే.
6 లైన్ల ఫ్లైఓవర్‌ను దాదాపు 4.08 కిలో మీటర్ల పొడువు, 23 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. 799 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తాడ్‌బన్ జంక్షన్, దానమ్మ హాట్స్, శాస్త్రీపురం, హాసన్ నగర్, శివరాంపల్లి జంక్షన్‌ల వద్ద ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఫ్లైఓవర్ పై నుంచి ఈజీ గా ట్రావెల్ చేయొచ్చు.
ఆరంఘార్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో బెంగుళూరు హైవే నుంచి సిటీలోకి ఈజీగా రావచ్చు. అలాగే ఎంజీబీఎస్, బహాదూర్ పురా నుంచి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవచ్చు. ఎస్ఆర్డీపీ కింద నిర్మిస్తున్న 42 ప్రాజెక్టులల్లో ఇప్పటి వరకు 36 ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు ఉన్నాయి. అందులో 37వ ప్రాజెక్టుగా సోమవారం అందుబాటులోకి రానున్న ఆరంఘార్ ఫ్లైఓవర్.
ఆరాంఘర్ to జూపార్క్ ఫ్లైఓవర్.. నేడు ప్రారంభించనున్న CM రేవంత్
HYDలో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్‌ను CM రేవంత్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఆరాంఘర్ -జూపార్క్ మధ్య 24 M. వెడల్పు, 6 లేన్లతో 4.08KM మేర దీన్ని నిర్మించారు. అందుకు రూ.799 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఫ్లైఓవర్ వల్ల జూపార్క్ నుంచి… pic.twitter.com/b7Gsyd3idz
— ChotaNews App (@ChotaNewsApp) January 6, 2025