Director Shankar: ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ (Shankar) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ.. ఊహించని రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈయన ‘రోబో’ సినిమా తర్వాత ఈయన కెరియర్ కాస్త డౌన్ అయ్యింది అని చెప్పాలి.ఇక అందులో భాగంగానే ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసిన గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా కూడా డిజాస్టర్ గా మారిపోవడంతో ఇక ఈయన పని అయిపోయిందని అందరూ అంటున్నారు. దీనికి తోడు శంకర్ ఆస్తులను ఈడి జప్తు చేసిన విషయం తెలిసిందే.ఇలా ఒకటి తర్వాత ఒకటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈయనకు తాజాగా ఉపశమనం కలిగింది. హైకోర్టు తాత్కాలిక స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
శంకర్ కు హైకోర్టులో ఊరట..
అసలు విషయంలోకెళితే.. శంకర్ స్థిర, చరాస్తులను జప్తు చేస్తూ ఈడి తీసుకున్న నిర్ణయంపై కోర్టు మద్యంతర స్టే విధించింది. సూపర్ హిట్ చిత్రమైన ‘ఎంథిరన్’ లోని అవకతవకలు జరిగాయంటూ.. డైరెక్టర్ శంకర్ పై కేసు నమోదయింది. ఇక శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్ (Rajinikanth), ఐశ్వర్యరాయ్(Aishwarya Rai)హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని హిందీలో ‘రోబోట్’ అనే పేరుతో విడుదల చేశారు.ఇక ఈ సినిమాకు సంబంధించిన వివాదం కారణంగానే శంకర్ కి చెందిన రూ.11.10 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు. అయితే తాజాగా హైకోర్టు తీసుకున్న నిర్ణయం నుండి శంకర్ కు కాస్త తాత్కాలిక ఉపశమనం లభించింది. ఈ కేసును విచారించిన హైకోర్టు ఈ విషయానికి సంబంధించిన ప్రైవేటు ఫిర్యాదు పై ఇప్పటికే స్టే విధించగా..శంకర్ ఆస్తిని స్తంభింప చేయడం సమర్థనీయం కాదు అంటూ తెలిపింది. ముఖ్యంగా హైకోర్టు తన ఉత్తర్వులలో…” ఒక ప్రైవేటు ఫిర్యాదు పై స్టే విధించినప్పుడు, డైరెక్టర్ ఆస్తిని స్తంభింప చేయడం సముచితం కాదు “అంటూ తెలిపింది.ఈడీ చర్యను సవాల్ చేస్తూ శంకర్ దాఖలు చేసిన పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో శంకర్ కి కాస్త తాత్కాలిక ఉపశమనం కలిగించింది.ఇక ఈ విషయంపై చట్టపరమైన ప్రక్రియ కూడా కొనసాగుతోంది.
శంకర్ సినిమాలు..
ఇక శంకర్ సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది ‘భారతీయుడు 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ చవి చూశారు .అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ‘భారతీయుడు 3’సినిమా షూటింగ్ కూడా దాదాపు కంప్లీట్ చేశారు. కాస్త క్లైమాక్స్ మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం . ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసి విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు ఒక స్టార్ హీరో కొడుకుతో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ యంగ్ హీరో కూడా ఇదివరకే పలు చిత్రాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడిప్పుడే కెరియర్ లో ముందడుగు వేస్తున్న ఈయన శంకర్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని తెలియడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి శంకర్ మళ్లీ గట్టి కం బ్యాక్ అవుతారేమో చూడాలి.