BigTV English

Maharaaja In Ott: ఓటీటీలో రికార్డుల మోత మోగిస్తున్న మహారాజ

Maharaaja In Ott: ఓటీటీలో రికార్డుల మోత మోగిస్తున్న మహారాజ

Maharaaja Movie Record Collections In Ott Platforms: కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.ఎందుకంటే ఏ రోల్‌ అయినా సరే అది హీరో అయినా.. విలన్ క్యారెక్టర్ అయినా సరే పరకాయ ప్రవేశం చేసి అందరినీ అలరిస్తారు. అంతేకాకుండా తన యాక్టింగ్ టాలెంట్‌తో ఆడియెన్స్‌ దగ్గర మంచి మార్కులు కొట్టేస్తాడు. చాలా రోజుల తర్వాత మహారాజ సినిమాతో సోలో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా సైలెంట్‌గా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ. ఇప్పటికే వంద కోట్ల వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద తిరుగులేని మూవీగా రికార్డులు సొంతం చేసుకుంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ విజయ్ సేతుపతి సినిమాకు భారీ కలెక్షన్లు వసూలు రాబట్టింది.


ఇక ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు మూవీ యూనిట్స్. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. అంతేకాదు ఈ వారం రిలీజ్ అయిన ట్రెండింగ్ జాబితాలో భారత్ వ్యాప్తంగా ఫస్ట్ ప్లేస్ సంపాదించుకుంది.ఇక ఈ మూవీ యూనిట్ నెట్టింట రియాక్ట్ అవుతూ.. ప్రతిచోట ఈ మూవీ రికార్డుల సునామీని క్రియేట్ చేస్తుందని టీమ్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ మూవీ సేతుపతికి 50వ మూవీ కావడం మరో విశేషం. ఈ మూవీకి నిథిలన్ స్వామినాథన్ డైరెక్షన్ వహించారు. అనురాగ్ కశ్యప్, నటి మమతామోహన్‌ దాస్ తదితరులు ఈ మూవీలో కీ రోల్స్ చేశారు. ఈ మూవీ దాదాపుగా రూ 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. అనూహ్యంగా ఈ మూవీకి రూ 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం ఇంకో హైలైట్ అనే చెప్పాలి.

Also Read: కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ అంటూ న్యాచురల్ హీరో ఎంట్రీ


అసలు ఈ మూవీ అసలు స్టోరీ ఏంటంటే.. ఈ మూవీలో విజయ్ ఓ బార్బర్. ఓ యాక్సిడెంట్‌లో విజయ్ తన భార్యను కోల్పోతాడు. అతనికంటూ మిగిలి ఉన్న ఒకే తోడు తన గారాల కూతురు. ఇక తన బిడ్డతోనే సిటికి దూరంగా ఉన్న ఓ ఇంట్లో నివాసం ఉంటాడు. ఒకరోజు మహారాజా ఒంటి నిండా తీవ్రమైన గాయాలతో పోలీస్ స్టేషన్‌కి వెళుతాడు. అంతేకాకుండా తన ఇంట్లోకి గుర్తుతెలియని దుండగులు చొరబడి తనపై దాడి చేయగా తాను పూర్తిగా గాయపడటంతో లక్ష్మీ అనే మహిళ తన బిడ్డ ప్రాణాలని దుండగుల నుండి కాపాడిందని పోలీసులు చెబుతాడు. అయితే తన బిడ్డ ప్రాణాలను కాపాడిన లక్ష్మీని దుండగులు ఎత్తుకుపోయారని.. ఎలాగైనా లక్ష్మీని వెతికిపెట్టాలని పోలీసులకు కంప్లైంట్‌ చేస్తాడు. మరీ మహారాజ చెప్పిన ఆ లక్ష్మీ ఎవరు.. అతడు ఊరికి దూరంగా ఎందుకు ఉన్నాడు..అతడిపై దాడి చేసిన దుండగులు ఎవరు.. ముందుగా పోలీసులు తన కంప్లైంట్‌ని పోలీసులు ఎందుకు తిరస్కరించారనే దానిపై ఈ మూవీ స్టోరీ ఉంది. సో.. ఈ మూవీలోని క్యారెక్టర్స్ అందులోని నటీనటులు వారి వారి క్యారెక్టర్స్‌కి జీవం పోశారనే చెప్పాలి.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×