BigTV English

Mahesh Babu: మ‌ళ్లీ వెకేష‌న్‌లోకి మ‌హేష్ అండ్ ఫ్యామిలీ

Mahesh Babu: మ‌ళ్లీ వెకేష‌న్‌లోకి మ‌హేష్ అండ్ ఫ్యామిలీ
mahesh babu

టాలీవుడ్ అగ్ర హీరోల్లో మహేష్ ఫ్యామిలీతో క‌లిసి విదేశాల‌కు ట్రిప్స్‌కు వెళ్లినంతగా మ‌రో హీరో వెళ్ల‌రంటే అతిశ‌యోక్తి కాదు. షూటింగ్‌ల‌కు ఏమాత్రం ఖాళీ దొరికితే వెంటనే కుటుంబంతో క‌లిసి మ‌హేష ఫారిన్ కంట్రీస్‌కి వెళ్లిపోతుంటారు. ఇప్పుడు మ‌రోసారి మ‌హేష్ విదేశీ యాత్ర‌కు వెళ్లిపోతున్నారు. కుటుంబంతో క‌లిసి ఆయ‌న స్పెయిన్‌కి వెళుతున్నారు. అదేంటి? ఇప్పుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త‌వ్ంలో షూటింగ్ జ‌రుగుతుంది క‌దా.. దాన్ని విడిచి పెళ్లి మ‌హేష్ ఎలా టూర్స్ వెళుతున్నార‌నే సందేహం రాక మాన‌దు.


వివ‌రాల్లోకి వెళితే.. రీసెంట్‌గానే మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న SSMB 28 చిత్రీకరణ సారథి స్టూడియోలో వేసిన సెట్‌లో జ‌రిగింది. ఈ షెడ్యూల్ పూర్త‌య్యింది. నెక్ట్స్ షెడ్యూల్‌ను ఫిబ్ర‌వ‌రి 20న స్టార్ట్ చేయ‌బోతున్నారు. దీని కోసం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెద్ద ఇంటి సెట్‌ను వేస్తున్నారు. ఆ సెట్ వ‌ర్క్ పూర్త‌య్యే లోపు ఖాళీగా ఉండ‌టం ఎందుక‌ని మ‌హేష్ అనుకున్నారేమో కానీ.. కుటుంబంతో క‌లిసి స్పెయిన్ టూర్‌కి చెక్కేస్తున్నారు. SSMB 28 విషయానికి వ‌స్తే అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం. హ‌రిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ (చిన‌బాబు)… ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ముందుగా ఈ ఏడాది ఏప్రిల్ 28న SSMB 28ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ మ‌హేష్ కుటుంబంలో కృష్ణ‌, ఇందిరా దేవి చ‌నిపోవ‌టంతో ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ పోస్ట్ పోన్ అయ్యాయి. ఆ ప్ర‌భావంతో ఈ సినిమాను ఆగ‌స్ట్ 11న రిలీజ్ చేయాల‌నుకుంటున్నట్లు రీసెంట్ ఇంట‌ర్వ్యూలో నాగ వంశీ తెలిపారు. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.


త్రివిక్ర‌మ్ సినిమా త‌ర్వాత మ‌హేష్.. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో పాన్ వ‌ర‌ల్డ్ మూవీ చేయ‌డానికి రెడీ కావాల్సి ఉంటుంది. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో లాంచ‌నంగా ప్రారంభిస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×