BigTV English
Advertisement

Nani next movie: ఫ్లాప్ డైరెక్ట‌ర్‌కి మ‌రో చాన్స్ ఇచ్చిన నాని!

Nani next movie:  ఫ్లాప్ డైరెక్ట‌ర్‌కి మ‌రో చాన్స్ ఇచ్చిన నాని!
NANI

మ‌న పక్కింటి కుర్రాడిలా అనిపించే హీరోల్లో నాని ఒక‌రు. అందుక‌నే ఆయ‌న్ని నేచుర‌ల్ స్టార్ అని ఫ్యాన్స్ అభిమానంతో పిలుచుకుంటుంటారు. ఈయ‌న తాజాగా త‌న‌తో ప్లాప్ సినిమాను డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌టానికి రెడీ అయిపోయార‌ట‌. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు.. వివేక్ ఆత్రేయ‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఇంత‌కు ముందు వ‌చ్చిన సినిమా ‘అంటే సుంద‌రానికీ!’. కామెడీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆశించి స్థాయిలో స‌క్సెస్ కాలేక‌పోయింది. అయితే ఎలాగైనా నానితో హిట్ కొట్టాల‌ని వివేక్ ఆత్రేయ నేచుర‌ల్ స్టార్ కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేశాడ‌ట‌. అది నానికి ఎంతో బాగా న‌చ్చింది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.


ప్ర‌స్తుతం నాని త‌న సినిమాల‌న్నింటినీ పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేసుకుంటూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే మార్చి 30న ద‌స‌రా సినిమాతో బిగ్ స్క్రీన్స్‌పై సంద‌డి చేయ‌బోతున్నారు మ‌న హీరో నాని. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌. దీన్ని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు నిర్మాత‌లు. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో ఉండ‌గానే నాని మ‌రో సినిమాకి సిద్ధ‌మైయ్యారు. అదే నాని 30.

రీసెంట్‌గానే ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఈ చిత్రంలో నాని జ‌త‌గా మృణాల్ ఠాకూర్ న‌టిస్తుంది. సౌర‌వ్ అనే డెబ్యూ డైరెక్ట‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో నాని ఓ పాప‌కు తండ్రిగా క‌నిపించ‌బోతున్నారు. మీసాలు కూడా ట్రిమ్ చేసి జుట్టు పెంచి డిఫ‌రెంట్ లుక్‌లో నాని మెప్పించ‌టానికి సిద్ద‌మ‌య్యారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చెరుకూరి మోహన్, డా.విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్. నాని 30ని నిర్మిస్తున్నారు.


Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×