E-Paper
Advertisement

Rajamouli- Mahesh Babu Video: దుబాయ్ నుండి దిగిన SSMB29 టీం.. మహేశ్ బాబు, రాజమౌళి అలా నడిసొస్తుంటే ఉంది మావా!

Rajamouli- Mahesh Babu Video: దుబాయ్ నుండి దిగిన SSMB29 టీం.. మహేశ్ బాబు, రాజమౌళి అలా నడిసొస్తుంటే ఉంది మావా!

Mahesh Babu – SS Rajamouli Back to India from Dubai (Video): ప్రస్తుతం తెలుగులో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే ఇవన్నీ ఒకెత్తయితే.. మహేశ్ బాబు – రాజమౌళి కాంబో మరొక ఎత్తు. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒకటే గోల, ఒకటే ఆసక్తి. ఎప్పుడెప్పుడు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌లు వస్తాయా అని సినీ ప్రియులు, అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఈ కాంబో మూవీ ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. అయితే ఇందులో నటీ నటులు కూడా ఆషామాషి వాళ్లు కాదు.. ఏకంగా హాలీవుడ్ నుంచే వస్తున్నారు. అందువల్లనే ఈ సినిమాకి ఇంత క్రేజ్ ఏర్పడింది. అందులోనూ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇక ఊహకు కూడా అంచనాలు అందవు.

దీంతో పాన్ ఇండియా రేంజ్‌లో కాకుండా ఈ మూవీ పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కబోతుంది. అందువల్లనే ఈ మూవీ కోసం యావత్ ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ‘SSMB 29’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ మూవీ అనౌన్స్ చేసి దాదాపు ఏడాదిన్నర కావొస్తుంది. ఇంకా ఈ మూవీ టీం ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే ఉంది.

Also Read: పవర్ స్టార్ ‘ఓజి’పై థమన్ అప్డేట్.. ఇది బిగినింగ్ మాత్రమే..

దీంతో ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుంది. ఈ మూవీ సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్తుంది అని వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్‌ వచ్చినా.. నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఎనర్జిటిక్ అప్డేట్‌ బయటకు వచ్చి సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది.

Also Read: War 2: ‘వార్ 2’ యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్.. ఇక బాక్సాఫీసు బద్దలే..!

ఇటీవల మహేశ్ బాబు, దర్శకుడు రాజమౌళి, ఈ చిత్ర నిర్మాత కేఎల్ నారాయణలు కలిసి హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించి కనువిందు చేశారు. అయితే వీరు దుబాయ్ వెళ్లినట్లు తెలిసింది. ఎందుకు వెళ్లారు.. అనేది తెలియరాలేదు. ఏదేమైనా ఈ ముగ్గురుని ఎయిర్‌పోర్ట్‌లో చూసి ఇక ఎస్ఎస్ఎంబీ సమయం ఆసన్నమైంది అంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

అయితే తాజాగా ఈ ముగ్గురు కలిసి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియోలో మహేశ్ స్టైలిష్ లుక్‌లో చాలా అందంగా కనిపిస్తున్నాడు. మహేశ్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×