BigTV English

Hollywood Action Master in War 2: ‘వార్ 2’ యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్.. ఇక బాక్సాఫీసు బద్దలే!

Hollywood Action Master in War 2: ‘వార్ 2’ యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్.. ఇక బాక్సాఫీసు బద్దలే!

Hollywood Action Master Spiro Razatos for  NTR and Hrithik Roshan’s  War 2 Fight Sequel: సినీ ప్రియులు యాక్షన్ సినిమాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. తమ అభిమాన హీరో యాక్షన్ ప్యాక్ట్ సినిమాతో వస్తున్నాడంటే ఇక థియేటర్ల వద్ద హంగామా మామూలుగా ఉండదు. ఎందుకంటే.. తమ అభిమాన హీరోని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో.. అలాంటి మాస్ లుక్‌లో యాక్షన్ సినిమాల్లో చూసి మురిసిపోతుంటారు. అయితే ఇప్పుడు అలాంటి ఒక సినిమాపైనే అందరి ఫోకస్ ఉంది.


అదే ‘వార్ 2’. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై ప్రేక్షకాభిమానుల్లో ఫుల్ హైప్ ఉంది. ఇదివరకు వచ్చిన ‘వార్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌ని ప్రకటించారు. అయితే ఫస్ట్ పార్ట్‌లో హృతిక్ – టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు. అయితే ఇప్పుడు సీక్వెల్‌ ‘వార్ 2’లో హృతిక్ – ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.

దీంతో ఈ సీక్వెల్ మూవీపై ఫుల్ బజ్ ఏర్పడింది. ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ‘వార్ 2’లో భాగం కావడంతో అందరిలోనూ అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రాన్ని ఆదిత్యా చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. కాగా ఇటీవలే ఈ మూవీకి సంబంధించి ఎన్టీఆర్ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.


Also Read: ‘వార్ 2’లో ఎన్టీఆర్ కోసం రంగంలోకి ‘యానిమల్’ బ్యూటీ..?

అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మరోక అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ బాలీవుడ్ మూవీ హాలీవుడ్ రేంజ్‌ యాక్షన్ ప్యాక్డ్ మూవీలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాల కోసం మేకర్స్ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ స్పిరో రజాటోస్‌ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ‘కెప్టెన్ అమెరికా: ది సివిల్ వార్’, ‘ఫాస్ట్ ఎక్స్’, కెప్టెన్ అమెరికా: ది ఫస్ట్ సోల్జర్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హాలీవుడ్ సినిమాలకు ఆయనే యాక్షన్ డిజైన్ చేశారు.

అయితే ఇప్పుడు ఆ స్టంట్ కొరియోగ్రాఫర్ ‘వార్ 2’ కోసం ముంబై వచ్చినట్లు సమాచారం. ఈ మూవీ తాజా షెడ్యూల్ ముంబైలోని ఓ స్టూడియోలో జరిగిందట. ఈ షెడ్యూల్‌లో హృతిక్ – ఎన్టీఆర్‌ల మధ్య ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ అప్డేట్‌తో సినీ ప్రియుల్లో మరింత ఉత్సాహం మొదలైంది. ఏదిఏమైనా ఈ మూవీని మేకర్స్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×