E-Paper
Advertisement

Rajamouli- Mahesh Babu Movie Update: మహేష్-రాజమౌళి మూవీకి హీరోయిన్ గా ఇండోనేషియన్ బ్యూటీ.. పెద్ద ప్లానేఇది!

Rajamouli- Mahesh Babu Movie Update: మహేష్-రాజమౌళి మూవీకి హీరోయిన్ గా ఇండోనేషియన్ బ్యూటీ.. పెద్ద ప్లానేఇది!
Advertisement

Mahesh Babu – Rajamouli Movie Heroine Update: సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ‘SSMB29’ మూవీ తెరకెక్కబోతుంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత రాజమౌళి తీయబోయే సినిమా ఇదే కావడంతో ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఫుల్ యాక్షన్ అండ్ అడ్వంచర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీతోనే మహేష్ బాబు పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నాడు.

అయితే ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయినట్లు ప్రముఖ రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రశాద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మహేష్ – రాజమౌళి కాంబో మూవీ ‘ఇండియానా జోన్స్’లా ఉంటుందని చెప్పడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.

Advertisement

ఈ మూవీ ఎక్కువగా అడవి నేపథ్యంలో సాగుతుందని విజయేంద్ర ప్రశాద్ చెప్పడంతో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.

ఈ సినిమా కోసం దాదాపుగా రూ.1500 కోట్ల బడ్జెట్‌ని కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఇక తెలుగు హీరో నటించే సినిమాకు ఇంత పెద్ద బడ్జెట్ పెట్టడం అంటే ఆషామాషి కాదని కొందరు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ నెల నుంచి స్టార్ట్ అవుతుందని సమాచారం.

Advertisement

READ MORE: SSMB-29: మహేశ్- రాజమౌళి సినిమా.. కథ చెప్పేసిన విజయేంద్ర ప్రశాద్..!

ఈ మూవీకోసం మహేష్ బాబు చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్నో సహసాలతో కూడిన సన్నివేశాలు ఉండటంతో మహేష్ తన బాడీని ఫిట్‌గా ఉంచేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే మహేష్ ఇటీవల జర్మనీ వెళ్లాడు.

ఈ మూవీలో నటీ నటుల కోసం రాజమౌళి బృందం వేట కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్ వంటి స్టార్స్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిని సంప్రదించినట్లు సమాచారం. ఇక వీరితో పాటు హాలీవుడ్ నటీనటులను కూడా రాజమౌళి ఈ సినిమాలో భాగం చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ హీరో క్రిస్ హెమ్స్‌వర్త్‌ను ఈ మూవీలో భాగం చేయనున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ మూవీల్లో క్రిస్ హెమ్స్‌వర్త్‌కు సూపర్ డూపర్ క్రేజ్ ఉంది. ప్రపంచంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుల జాబితాలో అతడు 31వ స్థానంలో ఉన్నాడు.

ఇక ఈ యాక్టర్ ఇండియన్ సినీ ప్రియులకు సుపరిచితమే. ‘థోర్’ మూవీ ద్వారా భారత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మరిన్ని సినిమాల్లో నటించి మరింత చేరువయ్యాడు.

READ MORE: SSMB29 : మహేశ్ బాబు – రాజమౌళి మూవీ.. బడ్జెట్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

అలాంటి పాపులర్ హాలీవుడ్ హీరోను ‘SSMB29’లోకి రాజమౌళి తీసుకువస్తున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలీదు కానీ, ఇదే కనుక నిజమైతే సినీ ప్రియులకు పండగే అని చెప్పాలి. ఇక ఈ నటుడితో పాటు ఇందులో హీరోయిన్‌ కోసం కూడా రాజమౌళి వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా మహేష్ బాబుకి హీరోయిన్‌ కూడా సెట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్‌ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆమెను హైదరాబాద్‌కు పిలిపించిన మేకర్స్ ఆమె లుక్ టెస్ట్ చేశారట.

దాదాపుగా ఈమెనే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె ఇన్‌స్టా ప్రొఫైల్‌ను నిశితంగా పరిశీలిస్తే.. ఇన్‌స్టాలో రాజమౌళిని చెల్సియా ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆమె మహేష్ బాబు సినిమాలో నటిస్తుందన్న ఊహాగానాలు రెట్టింపయ్యాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×