Big Stories

Xiaomi letter to India: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు భయపడుతున్నాయ్.. కేంద్రానికి షావోమి లేఖ!

Xiaomi letter to India

Xiaomi letter to India:

- Advertisement -

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ విడిభాగాల కంపెనీలు భారతదేశంలో తయారీ యూనిట్లు పెట్టడానికి భయపడుతన్నాయని ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షావోమి కేంద్రానికి తెలిపింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలో స్మార్ట్ ఫోన్ విడిభాగాల తయారీ ఫ్యాక్టరీలు స్థాపించాలని భావించి.. అందుకు షావోమి కంపెనీని సంప్రదించింది.

- Advertisement -

దేశంలోనే స్మార్ట్ ఫోన్ విడిభాగాలు తయారు చేయడానికి ప్రభుత్వం ఎటువంటి సహాయం కావాలో తెలపాల్సిందిగా షావోమి అధికారులను ప్రశ్నించింది. దీనికి సమాధానంగా షావోమి ఇండియా ప్రెసిడెంట్ మురళికృష్ణన్.. కేంద్ర ఐటి మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.

ఇండియాలో అత్యధికంగా అమ్ముడుపోయే స్మార్ట్ ఫోన్ అయిన షావోమీ ఇండియా కేంద్రం అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. దేశంలో స్మార్ట్ ఫోన్ విడిభాగాల తయారు చేసే కంపెనీలకు ప్రోత్సకాలు ఇవ్వాలని, ప్రత్యేక విడిభాగాల దిగుమతిపై పన్నులు తగ్గించాలని సూచిస్తూ.. గత కొంతకాలంగా భారత ప్రభుత్వం చైనా కంపెనీలపై విచారణ చేస్తున్న సందర్భంగా చైనా కంపెనీలు ఇండియాలో ఫ్యాక్టరీలు స్థాపించడానికి భయపడుతున్నాయని తెలిపింది. ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడానికి ఇష్టపడడం లేదని షావోమి ఇండియా ప్రెసిడెంట్ మురళికృష్ణన్ అన్నారు.

2020లో ఇండియా, చైనా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని చైనా కంపెనీలపై విచారణ చేపట్టింది. ఆ తరువాత చైనా నుంచి దిగుమతి అయ్యే స్మోర్ట్ ఫోన్ కీలక విడిభాగాలపై పన్నులు పెంచేసింది. చైనా కంపెనీలకు వ్యాపార లైసెన్సుల విషయంలో నియమాలను కఠినతరం చేసింది. ఆ తరువాత నుంచే చైనా కంపెనీల అధికారులకు భారత వీసా దొరకడం కష్టంగా మారింది.

ఈ విషయాన్ని షావోమి ఇండియా తన లేఖలో ప్రస్తావిస్తూ.. చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలతో చర్చలు జరిపి.. వారికి ఇండియాలో విడిభాగాల తయారీకి సహకారం అందిస్తామనే నమ్మకం కలిగించాలని సూచించింది.

2023లో చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వీవో టెక్నాలజీ నిబంధనలు అతిక్రమించి 13 బిలియన్ డాలర్లు చట్టవ్యతిరేకంగా చైనాకు తరలించిందనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. అలాగే షావోమీకి సంబంధించిన 600 మిలియన్ డాలర్లను భారత ప్రభుత్వం సీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీలు చట్టవ్యతిరేకంగా నిధులు సరఫరా చేస్తున్నాయని భారత అధికారులు తెలిపారు.

Xiaomi, letter, India, China, smartphone, manufacturing units, Incentives,

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News