Mahesh Babu : మహేష్ కు జక్కన్నతో టైం ట్రావెల్ తప్పదా..? అన్ని ఏళ్లు పడుతుందా?

Mahesh Babu : మహేష్ కు జక్కన్నతో టైం ట్రావెల్ తప్పదా..? అన్ని ఏళ్లు పడుతుందా?

Mahesh Babu
Share this post with your friends

Mahesh Babu

Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆ పేరు ఒక బ్రాండ్ గా మారిపోయింది. తెలుగు ఇండస్ట్రీని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న ఇప్పుడు మహేష్ బాబు తో మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి తన పాత ఫార్ములానే ఉపయోగించబోతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న మహేష్ ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. అంతటితో సరిపెట్టుకోకుండా..మా హీరోను వదలవా స్వామి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

తెలుగు సినిమాలను చులకనగా చూసే రేంజ్ నుంచి హాలీవుడ్ రేంజ్ కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ని తీసుకువెళ్లిన ఘనత రాజమౌళిది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఒకసారి అతని చేతిలో ఎవరైనా హీరో బుక్ అయితే సంవత్సరాలు తరబడి అంత సులభంగా బయటపడే అవకాశం అయితే ఉండదు. రాజమౌళి మూవీస్ డెప్త్ ఆ రెంజ్ లో ఉంటుంది కాబట్టే ఆస్కార్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా తో బాగా బిజీగా ఉన్నారు. తెలియని కొన్ని కారణాల వల్ల త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇక ఆ తర్వాత మహేష్ బాబుతో జక్కన్న సినిమా మొదలవుతుంది అని టాక్. ఇప్పటికే మూవీకి సంబంధించిన స్టోరీ స్క్రిప్ట్ ను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కంప్లీట్ చేశారట. అయితే ప్రస్తుతం ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నట్లు ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

జక్కన్న మహేష్ బాబు తో తీయబోతున్న ఈ చిత్రం అడ్వెంచర్ జోనర్ లో ఉంటుంది. ఇక మూవీకి సంబంధించిన షూటింగ్ కోసం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉండబోతోంది అని టాక్. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఈ ఏడాది చివరికి స్టార్ట్ అవుతాయని తెలుస్తోంది.అంటే వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

రాజమౌళి సినిమా అంటే ఆ హీరో కనీసం మూడు సంవత్సరాలు బుక్ అయిపోతాడు. మరి మహేశ్ బాబు తో రెండు సినిమాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా జక్కన్న రెండు భాగాల్లో ఈ సినిమా తీస్తున్నాడో లేదో తెలియదు కానీ అదే జరిగితే.. మహేష్ బాబు ఒక ఆరు సంవత్సరాల పాటు జక్కన్నతో కలిసి టైం ట్రావెల్ చేయాల్సి వస్తుంది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

God Movie On OTT : ఓటీటీలో సైకో థ్రిల్లర్ మూవీ “గాడ్”.. ఎక్కడంటే?

Bigtv Digital

Pushpa 2 : ‘అస‌లు పుష్ప ఎక్క‌డ‌?’..ఆస‌క్తిక‌రంగా అప్‌డేట్‌

Bigtv Digital

Avasarala Srinivas : ‘అవతార్ 2’లో భాగమైన తెలుగు డైరెక్టర్

BigTv Desk

First movie of suhas in theatre : హీరోగా థియేటర్స్‌లోకి వస్తోన్న సుహాస్ తొలి సినిమా ఏదో తెలుసా

Bigtv Digital

Keeda Cola Movie Updates : ‘కీడా కోలా’ టీజర్ ఔట్.. క్రైమ్‌తో తరుణ్ భాస్కర్ కామెడీ..

Bigtv Digital

Jr Ntr Payal Ghosh: తార‌క్ సూపర్ అంటున్న త‌మ‌న్నా ఫ్రెండ్‌… మ‌రి త‌మ‌న్నా స్పందించ‌రా?

Bigtv Digital

Leave a Comment