BigTV English

Mahesh Babu: ఐకానిక్‌ పాత్రకు మహేశ్‌ డబ్బింగ్‌.. తెలుగు ట్రైలర్‌ ఎప్పుడంటే!

Mahesh Babu: ఐకానిక్‌ పాత్రకు మహేశ్‌ డబ్బింగ్‌.. తెలుగు ట్రైలర్‌ ఎప్పుడంటే!

Mahesh Babu to dub for Telugu version of Mufasa: ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ముఫాసా: ది లయన్ కింగ్’. ఈ మూవీలోని ముఫాస పాత్ర తెలుగు వర్షన్‌కు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు డబ్బింగ్ చెప్పనున్నారు. ఈ మేరకు డిస్నీ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్టర్ పంచుకుంది. దీనికి సంబంధించిన తెలుగు ట్రైలర్ ఈనెల 26న ఉదయం 11.07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది.


ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు నటిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ సినిమాను కిస్మస్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ విషయంపై మహేశ్ బాబు స్పందించారు. డిస్నీ అంటే చాలా గౌరవమన్నారు. ముఫాసా తన కుమారుడిని నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి మహారాజుగా అందరినీ ఆకర్షిస్తాడన్నారు. డిస్నీతో కలిసి పనిచేయడం ప్రత్యేకంగా ఉందని, నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేమైందిగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.


ఈ సినిమాను నా పిల్లలతో కలిసి చేస్తానని మహేశ్ బాబు వెల్లడించారు. డిసెంబర్ 20న తెలుగులో ముఫాసాను బిగ్ స్క్రీన్ పై నా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మహేశ్ బాబు హర్షం వ్యక్తం చేశారు.

Also Read: ‘బిగ్ బాస్ సీజన్ 8’ డేట్ ఫిక్స్.. అన్‌లిమిటెడ్ ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌!

అయితే, హిందీలో ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో ముఫాసా పాత్రకు బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ చిన్న కుమారుడు అబ్రం వాయిస్ అందించారు. అలాగే హిందీ వెర్షన్ లో షారుక్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. సింబా పాత్రకు షారుక్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×