Mahesh Babu Instagram Story: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు సినిమా రి రిలీజ్ అయితే కేవలం మహేష్ అభిమానులు మాత్రమే కాకుండా అందరి హీరోల అభిమానులు కూడా వెళ్లి చూస్తారు. తన కెరియర్ లో అటువంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు మహేష్ బాబు. ఇప్పటికే మహేష్ బాబు చేసిన ఒక్కడు సినిమా దాదాపు మూడుసార్లు రీ రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమాకి మొదట మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ లో మహేష్ కి ఉన్న క్రేజ్ వలన ఆ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమాను చేయనున్నాడు. ఈ సినిమా 2027 లో రిలీజ్ అవుతుంది అని అందరూ ఊహిస్తున్నారు. కానీ ఎవరికి క్లారిటీ లేదు. ఎందుకంటే అదంతా జక్కన్న చేతిలో ఉంది.
మొదటిసారి ఆల్రెడీ స్టార్ ఇమేజ్ ఉన్న ఒక హీరోతో ఎస్ఎస్ రాజమౌళి పనిచేస్తున్నారు. ఇంతకుముందు ఎస్ఎస్ రాజమౌళి చేసిన సినిమాల వలన చాలామందికి స్టార్డం వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన లొకేషన్స్ వేటలో ఉంది చిత్ర యూనిట్. మహేష్ బాబు సినిమాలో విపరీతంగా చూస్తారు అనే విషయం అందరికీ తెలిసిందే. చాలా సినిమాలు చూసిన తర్వాత మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా ఆ సినిమా గురించి ట్వీట్ పెడుతూ ఉంటారు. సుమంత్ ప్రభాస్ దర్శకత్వం వహించిన మేము ఫేమస్ సినిమా గురించి కూడా మహేష్ బాబు ట్విట్ చేశారు. ఆ సినిమా కూడా మహేష్ బాబు చూస్తాడా అని అప్పట్లో చాలా మంది డిస్కషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇలా ఎన్నో సినిమాలు గురించి మహేష్ బాబు ట్విట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
Also Read : Divorce :మొన్నే పెళ్లి.. అప్పుడే విడాకులు.. హీరోయిన్ ను టార్చర్ చేసిన భర్త..?
రీసెంట్ గా నయనతార విగ్నేష్ శివన్ పెళ్లి వీడియో నెట్ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ వీడియోకి సంబంధించి చాలా వివాదాలు కూడా మొదలయ్యాయి. ధనుష్ ప్రొడ్యూస్ చేసిన నేను రౌడీనే సినిమాలోని కొన్ని క్లిప్స్ ను చెప్పకుండా ఈ వీడియో కోసం యూస్ చేశారని.. ధనుష్ కు నయనతారకి మధ్య వివాదాలు జరిగాయి. ఈ తరుణంలో ఈ వీడియోను చాలామంది నెట్ఫ్లిక్స్ లో చూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ వీడియోను చూసి ఇన్స్టాగ్రామ్ వేదికగా స్టోరీ కూడా పెట్టాడు. అయితే ఇది చూసిన చాలామంది మహేష్ బాబు అభిమానులు మహేష్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మహేష్ బాబు కి ఏమైనా పని చెప్పండి రాజమౌళి గారు అంటూ జక్కన్నను ట్యాగ్ చేయడం కూడా మొదలుపెట్టారు. మహేష్ కి ఏ పని లేకపోవడం వల్లనే చివరికి ఈ వీడియోలు కూడా చూస్తున్నాడు అంటూ వాళ్ళ అభిప్రాయం.