Divorce : సినీ ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు చేసుకోవడం కామన్ కానీ కొన్ని జంటలు మాత్రమే సంతోషంగా ఉంటారు. అయితే కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీ లో బిజీగా ఉన్న హీరోయిన్లు తమకు నచ్చిన వారితో డేటింగ్ ను కూడా చేస్తారు. చివరికి పెళ్లి వరకు తీసుకొని వస్తారు. తల్లి దండ్రులను ఒప్పించి పెళ్లివరకు తీసుకొని వెళ్తారు. ఎంతో ఘనంగా పెళ్లి చేసుకుంటారు. ఆ పెళ్లి గురించి అంతా మాట్లాడుకోవడం కూడా అయిపోక ముందే గొడవలు వచ్చాయని భర్తకు దూరం అవుతున్నారు. ఈ మధ్య పెళ్లి చేసుకొని విడిపోతున్న జంటలే ఎక్కువగా ఉన్నారు. తాజాగా ఆ లిస్ట్ లోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది.. మొన్న పెళ్లి చేసుకుంది. అప్పుడే విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య తో ఎప్పుడైతే విడిపోయిందో అప్పటినుంచి విడాకుల వార్తలు అనేకం బయటకు వస్తున్నాయి. తాజాగా ఒక స్టార్ హీరో కూతురు కూడా తన భర్తతో విడిపోతుందంటూ ఒక వార్త నెట్టింటా చక్కర్లు కొడుతోంది. ఆమె ఎవరనేది పూర్తిగా బయటకు రాలేదు కానీ సోషల్ మీడియా లో వార్త మాత్రం దారుణంగా వైరల్ అవుతుంది. ఆమె ప్రేమించే ఇటీవల పెళ్లి చేసుకుంది. కానీ భర్త తో అప్పుడే గొడవలు రావడంతో విడిపోవాలని అనుకుంటుందట. అందులో నిజమేంతో తెలియదు గాని ఈ వార్త మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది.
సమాజం లో ఎంతో పరువు ఉన్నటువంటి ఆ స్టార్ హీరో కూతురిలా చేయడంతో ఆ హీరో ఏం చేయాలో తెలియక కూతురును భర్త తో కలిపే ప్రయత్నం చేస్తున్నారట. కానీ కూతురు మాత్రం ససేమిరా అనడంతో గుట్టుచప్పుడు కాకుండా విడాకులు తీసుకోవాలని ట్రై చేస్తున్నారట. అయితే మధ్యలో పెద్దలు కలుగ చేసుకొని సంధి కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఈ విడాకుల వార్త బయటకు వస్తుందా లేదంటే సైలెంట్ గానే సమసి పోతుందా అనేది కొద్ది రోజుల్లో తెలియనుంది.. ఇక ఈ మధ్య కాలంలో సెలెబ్రేటీ జంటలు పెళ్లి చేసుకోవడం విడిపోవడం కామన్. విడాకులు తీసుకొని సైలెంట్ గా ఉంటున్నారా అంటే మళ్లీ కొత్తగా ప్రేమలో పడుతూ, మళ్లీ పెళ్లి చేసుకుని మళ్లీ విడాకుల బారిన పడుతూ ఇలా ఓ తతంగాన్నీ నడిపిస్తున్నారు. ఈ వ్యవహారాలు ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ వారే చేయడంతో వారిని చూసి బయట జనాలు కూడా నేర్చుకుంటున్నారు. ఇలాంటి వాటికి ఎప్పుడు బ్రేక్ పడుతుందో చూడాలి..
ఇండస్ట్రీలో ఎక్కువగా విడాకులు తీసుకోవడం మళ్లీ వేరే వాళ్ళతో కలిసి సహజీవనం చెయ్యడం. ఆ తర్వాత వాళ్ళతో కూడా గొడవలు రావడంతో విడిపోతున్నారు. ఇండస్ట్రీలోనే ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. తమిళ ఇండస్ట్రీలో ఇలాంటివి కాస్త ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మధ్య ఎక్కువ మంది సెలెబ్రేటీలు విడాకులు తీసుకొని వేరొకరితో మళ్లీ బిజీ అని ప్రకటిస్తున్నారు..