E-Paper
Advertisement

Mahesh Babu : వరల్డ్ వైడ్ రికార్డ్ ఇది… ‘కుర్చీ మడతపెట్టి సాంగ్’ జోరు మాములుగా లేదు..!

Mahesh Babu : వరల్డ్ వైడ్ రికార్డ్ ఇది… ‘కుర్చీ మడతపెట్టి సాంగ్’ జోరు మాములుగా లేదు..!

Mahesh Babu :టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా, శ్రీ లీల(Sreeleela), మీనాక్షి చౌదరి(Meenakshi Choudhary) ప్రధాన పాత్రల్లో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రం ‘గుంటూరు కారం’. ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహించిన ఈ చిత్రం మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కానీ ఒక వర్గం అభిమానుల హృదయాలలో మాత్రం ప్రత్యేక స్థానం సంపాదించుకుందని చెప్పవచ్చు. ప్రత్యేకించి ఈ చిత్రంలోని కొన్ని ఎలిమెంట్స్ సినిమా స్థాయిని ఊహించని స్థాయికి పెంచేసాయి.

వరల్డ్ వైడ్ రికార్డు సృష్టించిన కుర్చీ మడతపెట్టి..

ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్లో ట్రెండ్ క్రియేట్ చేశాయి. అందులో ఒకటి “కుర్చీ మడత పెట్టి”. ఈ పాట ఊహించని స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ పాటకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ (S.S.Thaman ) సంగీతం అందించగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం బాగా వర్కౌట్ అయింది. ఈ పాట విడుదలైన నాటి నుంచి యూట్యూబ్ లో దూసుకుపోతూ.. 2024 సంవత్సరానికి గానూ గ్లోబల్ టాప్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును అందుకుంది. మనదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ప్రజాదారణ పొందింది అంటే, ఏ రేంజ్ లో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ పాట వ్యూస్ పరంగా మాత్రమే కాదు పాప్ కల్చర్ లో కూడా తనదైన ముద్ర వేసుకుంది. ఇప్పటివరకు 526 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టింది ఈ పాట. పల్లెల నుంచి పట్టణాల వరకు కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ పాట విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో మహేష్ బాబు మేనరిజం, స్టైల్, లుక్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

కాలాపాషా నుంచీ పుట్టుకొచ్చిందే ఈ పాట..

ఇకపోతే “కుర్చీ మడత పెట్టి” పాట సోషల్ మీడియాలో కాలాపాషా అనే ఒక వ్యక్తి నుంచి పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో సాంగ్స్ ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా ఉంటాయని ఈ సాంగ్ తో మరొకసారి నిరూపణ అయింది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచిందనడంలో సందేహం లేదు. ఏది ఏమైనా మహేష్ బాబు ఈ పాటతో వరల్డ్ వైడ్ రికార్డు క్రియేట్ చేశారని చెప్పవచ్చు.

మహేష్ బాబు సినిమాలు..

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ల సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూడు సంవత్సరాలలో మహేష్ బాబు నుంచి మరో మూవీ రాదని స్పష్టం అవుతుంది. ఇక ఇందులో ప్రముఖ హాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra)హీరోయిన్గా అవకాశాన్ని అందుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను రూ.1000 కోట్ల బడ్జెట్ తో కే.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×