Pawan About Allu Arjun : సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ చనిపోవడం, ఈ కేసులో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఇప్పటిదాకా ఈ వివాదంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందించలేదు. కానీ తాజాగా ఆయన గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్లగా, అల్లు అర్జున్ వివాదంపై మీడియా నుంచి పవన్ కళ్యాణ్ కి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం వివాదంపై స్పందించారు.
తాజాగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్లారు. వైసిపి నేతల దాడితో గాయపడి, అతను ఆస్పత్రిలో చేరాడు. అతన్ని పరామర్శించిన అనంతరం జవహార్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు పవన్. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో అల్లు అర్జున్ వివాదం గురించి ప్రశ్నించారు. “అల్లు అర్జున్ వివాదంపై టీఎస్ సర్కార్ స్పందించింది. మీరేమంటారు?” అని ప్రశ్నించగా “రిలవెంట్ ప్రశ్నలు అడగండి… ఇక్కడ జనాలు చచ్చిపోతే సినిమా గురించి మాట్లాడతారా? పెద్ద మనసుతో ఆలోచించడి… పెద్దగా ఆలోచించండి” అంటూ పవన్ కళ్యాణ్ అసహనాన్ని వ్యక్తం చేశారు. మాట్లాడడానికి సినిమాల కంటే పెద్ద విషయాలు చాలా ఉన్నాయి అన్నట్టుగా పవన్ సమాధానం చెప్పడం గమనార్హం.
అయితే ఈ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులు పెడుతున్నారని, రీసెంట్ భేటీ తర్వాత సినిమా టికెట్లు, బెనిఫిట్ షోలు ఇవ్వడానికి ఒప్పుకోమని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్ వివాదంపై ఇప్పటి దాకా స్పందించని పవన్ కళ్యాణ్, ఇప్పుడు మీడియా ప్రశ్నించినప్పటికీ సమాధానాన్ని దాటవేయడం చర్చకు దారి తీసింది.
అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన పవన్ కళ్యాణ్#PawanKalyan #AlluArjun #LatestNews #Swetchadailyepaper pic.twitter.com/w47pkxeGic
— Swetcha Daily (@swetchadaily) December 28, 2024
పైగా గతంలో ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ జీవో రిలీజ్ చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డ సంగతి తెలిసిందే. నటులను అడుక్కునేలా చేస్తున్నారని, తాము పెట్టుబడి పెట్టి తీసే సినిమాలపై మీ పెత్తనం ఏంటి? అంటూ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మాత్రం సొంత ఫ్యామిలీలో, అల్లు అర్జున్ పై ఇంతటి వివాదం చెలరేగినప్పటికీ ఆయన మౌనంగా ఉండడం వెనక అర్థమేంటో మూవీ లవర్స్ కి అంతు పట్టట్లేదు.
ఇదిలా ఉండగా ఏపీ రాజకీయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. అలాగే ఆయన సినిమా షూటింగ్ లకు కూడా హాజరవుతున్నారు. పవన్ వ్యవహారం చూస్తుంటే ఇప్పట్లో అల్లు అర్జున్ వివాదంపై ఎక్కడా పెదవి విప్పేలా కనిపించట్లేదు. దీంతో అల్లు – మెగా వివాదం అలాగే కంటిన్యూ అవుతుందని, అందుకే పవన్ కళ్యాణ్ కావాలనే ఈ వివాదంలో జోక్యం చేసుకోలేదని అనుకుంటున్నారు నెటిజన్లు.