E-Paper
Advertisement

Animal Pre-Release Event : ఘనంగా యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ .. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?

Animal Pre-Release Event : ఘనంగా యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ .. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?
Advertisement
Animal Pre-Release Event

Animal Pre-Release Event update(Cinema news in telugu):

అర్జున్ రెడ్డి అనే ఒక్క మూవీతో టాలీవుడ్ లో..దాని రీమేక్ అయిన కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో.. తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ మూవీ డిసెంబర్ 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది. మూవీ రిలీజ్ దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ కూడా తెగ జోరుగా సాగిస్తోంది .ఈ నేపథ్యంలో ఈరోజు భారీగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు మూవీ యూనిట్.

ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పలు రకాల ప్రచార చిత్రాలు ట్రైలర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ముఖ్యంగా ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా.. ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. విజువల్స్.. టేకింగ్ దగ్గర నుంచి మ్యూజిక్.. డైలాగ్స్ వరకు ప్రతిదీ ఎక్స్ట్రాడినరీ అని అనవచ్చు. పవర్ ప్యాకెడ్ ట్రైలర్ అందరినీ మెప్పించడంతో రాబోయే చిత్రం పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ ట్రైలర్ లో మారణ హోమం, భీభత్సరం చూసి ఏం ట్రైలర్ రా స్వామి.. ఇంతవరకు ఎప్పుడూ చూడనంత వయోలెన్స్ అని అంటున్నారు.

Advertisement

ఈ మూవీ తో సందీప్ మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈరోజు జరగబోయే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గురించి కూడా మంచి పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. ఇక ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతోంది.. టాలీవుడ్ ఇండస్ట్రీ క్రేజ్ పెంచిన జక్కన్న.. సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ విషయం మూవీ టీం ప్రకటించిన తర్వాత జరగబోయే ఈవెంట్ కు మరింత క్రేజ్ సంతరించుకుంది.

ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్‌ తో వస్తున్న ఈ మూవీ లో అనిల్ కపూర్, బబ్లూ పృథ్వీరాజ్, బాబీ డియోల్ కీలకపాత్రలో నటిస్తున్నారు. సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏ సర్టిఫికెట్ పొందింది. అయితే మూవీకి సంబంధించిన రన్ టైం మాత్రం కాస్త భారీగానే ఉంది. గట్టిగా మూడు గంటలు సినిమా హాల్లో కూర్చోవడం కష్టం అయిపోయిన ఈ రోజుల్లో ఈ మూవీ ఏకంగా 3 గంటల 21 నిమిషాల 23 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెట్టేలా ఉంది. కంటెంట్ కరెక్ట్ గా కనెక్ట్ అయితే అంత సేపు కూర్చోవడం పెద్ద పనేమీ కాదనుకోండి.. మరి ఈ మూవీ ఎంటర్టైన్ చేసి థియేటర్లో చివరి వరకు కూర్చో పెడుతుందా.. లేదా అనేది విడుదల తర్వాతే తెలుస్తుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×