E-Paper
Advertisement

Breaking news: రైతుబంధు అనుమతిని ఉపసంహరించుకున్న ఈసీ

Breaking news: రైతుబంధు అనుమతిని ఉపసంహరించుకున్న ఈసీ

Rythu bandhu latest news telugu(Breaking news in Telangana):

రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంది. రైతుబంధుకు నాలుగు రోజుల క్రితమే ఈసీ అనుమతిచ్చింది. అయితే పాలకుర్తి సభలో మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యల వల్లే ఈసీ తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకున్నట్టు తెలుస్తోంది. మంగళవారం రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ అవుతుందని హరీశ్ రావు చెప్పాడు. ఉదయం చాయ్ తాగేలోపు టింగ్ టింగ్ మంటూ ఫోన్లు మోగుతాయన్నారు.

ఈ నెల 28 లోపు రైతు బంధును పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. కానీ.. శని, ఆది, సోమ వారాలు బ్యాంకులకు సెలవులు కావడంతో రైతుల ఖాతాల్లో పంటపెట్టుబడి సాయం కింద నగదు జమ చేసే అవకాశం లేకపోయింది. 28వ తేదీ ఒక్కరోజే సమయం ఉండటంతో.. కొంతమంది రైతుల ఖాతాల్లోనైనా డబ్బులు జమ చేయాలని భావించారు. ఇంతలోనే మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో ఈసీ బీఆర్ఎస్ కు షాకిచ్చింది.

ప్రతిఏటా ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఒక్కోసీజన్ కు ఎకరానికి రూ.5 వేలు చొప్పున రెండు సీజన్ లకు మొత్తం రూ.10 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. వానాకాలంతో పాటు యాసంగి సీజన్ రావడానికి ముందు నిధులను విడుదల చేస్తుంది. ఈసారి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో యాసంగి సీజన్ నిధుల విడుదల జమకాలేదు. ఈ పథకానికి కోడ్ వర్తించదని, ఎప్పటినుంచో అమల్లోకి వస్తున్న పథకమని ఈసీకి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాయగా.. రైతుబంధు నిధుల విడుదలకు అనుమతిచ్చింది. ఇంతలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న ఈసీ.. రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. దాంతో. రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు పంట పెట్టుబడి సాయం నిలిచిపోయింది.

.

.

.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×