Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu ), రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో ఎస్.ఎస్.ఎం.బి – 29 (SSMB 29) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra)ఇందులో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. మలయాళ స్టార్ హీరో కమ్ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో మెయిన్ విలన్ ఈయనే అనుకున్నారు. కానీ నల్ల జాతీయుడిని రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా సినిమా షూటింగు మే నుండి జూన్ ఎండింగ్ వరకు నిర్విరామంగా సాగుతుందని ఆడియన్స్ కూడా అనుకున్నారు. కానీ అంతలోపే మహేష్ బాబుకి రాజమౌళి సెలవులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
వేసవి సెలవులు ప్రకటించిన రాజమౌళి..
సాధారణంగా రాజమౌళి సినిమాలు అంటే నటీనటులకు ఏమాత్రం బ్రేక్ ఉండదు. కానీ మహేష్ బాబుకు బ్రేక్ అంటే ఏదో ఆలోచించాల్సిన విషయమే అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. అటు మహేష్ బాబు కూడా వేసవి సెలవులు మొదలైతే చాలు విహారయాత్రకు వెళ్లిపోతారు. ప్రతి ఏటా ఇదే జరుగుతోంది. ఇక రాజమౌళి సినిమా అనేసరికి మహేష్ మారుతాడని, తనకు సెలవులు దక్కే అవకాశం ఉండదని అందరూ అనుకున్నారు. కానీ మహేష్ ఏ మాత్రం మారలేదు. రాజమౌళి కాదు కదా దిగ్గజ ఇంటర్నేషనల్ డైరెక్టర్లు వచ్చినా నా రూటు మార్చుకోను అంటున్నారు మహేష్ బాబు అని అభిమానులు కూడా సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి కూడా బ్రేక్ వచ్చింది. అది కూడా వేసవి సెలవుల కోసమే అన్నట్లు తెలుస్తోంది.
ఏకంగా 40 రోజులు హాలిడేస్..
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారులలో జరుగుతోంది. అందులోనూ ప్రియాంక – మహేష్ బాబు మధ్య ఒక పాట షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం.ఈరోజుతో ఈ షెడ్యూల్ కూడా పూర్తవుతుంది. ఇక రేపటి నుంచి 40 రోజులపాటు మహేష్ బాబు బ్రేక్ తీసుకోనున్నారట. ఇక తిరిగి జూన్ 10వ తేదీన సినిమా షూటింగ్ మొదలు కానుందని సమాచారం. అయితే ఈసారి వారణాసి సెట్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే వేసవి సెలవులు వచ్చేసాయి. ఇక ఈ 40 రోజులు మహేష్ బాబు విదేశాలలోనే ఉండబోతున్నట్లు సమాచారం. అటు రాజమౌళి కూడా విహారయాత్రకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే 2026లో ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నప్పటికీ.. ఈ సినిమా షూటింగు 2027 వరకు కొనసాగేలా ఉందని, అటు సినీవర్గాలు కూడా చెబుతున్నాయి. ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నానా పటేకర్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇంకా చిత్ర బృందం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు..మొత్తానికైతే రాజమౌళిని కూడా మెప్పించి మహేష్ బాబు మళ్లీ వేసవి సెలవులను ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్ళబోతున్నారని చెప్పవచ్చు. అసలే వేసవికాలం వచ్చేసింది. మండే ఎండల కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక మహేష్ బాబు కూడా ఈ ఎండ దాటికి తట్టుకోలేకే చల్లగా ఉండే ప్రదేశాలను ఎంచుకోబోతున్నట్లు సమాచారం.