Hyderabad News: జీహెచ్‌ఎంసీలో గాడిలో పడుతుందా? గత ప్రభుత్వ పాలన నుంచి అధికారులు ఇంకా బయటకు రావడం లేదా? మొద్దు నిద్ర వీడడం లేదా? ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన కమిషనర్లు ఎంత చెప్పినా అధికారులు పట్టించుకోలా? అందుకోసమే తరచూ అధికారుల మార్పడి జరుగుతోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
మంగళవారం జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్‌గా ఆర్‌వి కర్ణన్ బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వెళుతున్న కమిషనర్ ఇలంబర్తి నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. కర్ణన్ బాధ్యతలు తీసుకోగానే దిగువ స్థాయిలో సిబ్బందిలో టెన్షన్ మొదలైంది. నిజాయితీగా ఉండే ఆయన దగ్గర పని చేయగలమా? లేదా అన్న డౌట్ అప్పుడే కొందరి అధికారుల్లో మొదలైంది.
అధికారులకు చుక్కలు
కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజు బుధవారం నుంచి ఫీల్డ్ విజిట్స్ మొదలుపెట్టారు కమిషనర్ కర్ణన్. ఫీల్డ్‌లో ఆయనకు ఏ ఒక్క అధికారి కనిపించలేక పోవడంతో షాక్ అయ్యారు. అధికారులు ఫీల్డ్‌లో లేకుంటే సమస్యలు ఎలా తెలుస్తాయన్నది ఆయన మాట. అధికారులందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారట కమిషనర్ కర్ణన్.
జోనల్ కమిషనర్లు, ఇతర అధికారులు అందరూ ఉదయం ఐదున్నర గంటలకు ఫీల్డ్ మీద ఉండాల్సిందేనని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా లేని పక్షంలో నేరుగా తనకే చెప్పాలని ప్రస్తావించారు. ప్రతి రోజూ ఉదయం 6.30 గంటలకు అందరి అటెండెన్స్ పూర్తి చేయ్యాలని కంట్రోల్ రూమ్ అధికారులను కోరారు కమిషనర్. దీంతో గురువారం ఉదయం చాలామంది అధికారులు ఫీల్డ్‌లో దర్శనమిచ్చారు.
ALSO READ: సీక్రెట్ డాక్యుమెంట్ కాదు.. తెలంగాణ మోడల్‌కు సీఎం రేవంత్ డిమాండ్
గతంలో ఆయన
జీహెచ్ఎంసీ అధికారులకు ప్రస్తుత కమిషనర్ కర్ణన్ గురించి బాగా తెలుసు. ఆరోగ్య విభాగంలో ఉన్నప్పుడు హైజీన్ ప్రమాణాలను ఉల్లంఘించిన నగరంలో రెస్టారెంట్లు, పబ్‌లు, ఐస్‌క్రీమ్ పార్లర్లపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా దాడులు చేశారు. ఆహార భద్రతపై ప్రజలలో మంచి అవగాహన కల్పించారు. ఎప్పటికప్పుడు వాటిపై సోదాలు చేయడం, ఆపై ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది.
ఇన్నాళ్లు తాము ఇలాంటి ఆహారం తిన్నామా అంటూ సగటు వినియోగదారులు షాకయ్యారు. ఈ సమయంలో ఆయన్ని తీసుకొచ్చి జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. దీంతో పని చేయని కొందరు అధికారులు బెంబేలెత్తుతున్నారు.