Tips For BP Control: కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల మీ కొలెస్ట్రాల్ , రక్తపోటు రెండూ పెరుగుతాయి. ఫలితంగా ప్రాణాలకే ప్రమాదం కలిగే అవకాశం ఉంది. అధిక రక్తపోటు శరీరానికి అంతర్గత నష్టాన్ని కలిగించే సమస్య. దీనికి సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే.. అది గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా బీపీ పెరగకుండా జాగ్రత్తపడవచ్చు.
బీపీ పెరగడానికి కారణాలు ఏమిటి ?
మన శరీరంలో రక్తపోటు పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. జీవనశైలిలో మార్పులు కూడా ఇందుకు కారణం అవుతాయి. ముఖ్యంగా వీటిలో ధూమపానం, మద్యం సేవించడం, అధిక బరువు, దీర్ఘకాలిక ఒత్తిడి గురికావడం వంటివి కూడా ఉన్నాయి.
అధిక ఉప్పు
ధూమపానం, మద్యం
ఊబకాయం
ఒత్తిడి
శారీరక శ్రమ లేకపోవడం
డైటీషియన్లు, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రాసెస్ చేసిన మాంసం తినడం అధిక రక్తపోటును పెంచే అత్యంత ప్రమాదకరమైన ఆహారాలలో ఒకటి. వీటిలో ఉప్పు పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది.
2024లో బ్రెజిల్‌లో జరిపిన ఒక అధ్యయనంలో రోజుకు కేవలం 17 గ్రాముల ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్ల అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుందని తేలింది.
శరీరంలో ఉప్పు ఎక్కువగా ఉంటే ఏమి జరుగుతుంది ?
ఉప్పులో ఉండే సోడియం శరీరంలో నీటిని నిలుపుకుంటుంది. ఇది రక్త పరిమాణాన్ని పెంచుతుంది. అంతే కాకుండా రక్త నాళాలపై ఒత్తిడిని పెంచుతుంది. ఈ ఒత్తిడి క్రమంగా అధిక రక్తపోటు , గుండె జబ్బులకు పునాది వేస్తుంది.
ప్రాసెస్ చేసిన మాంసం కూడా క్యాన్సర్‌కు కారణం:
రక్తపోటు మాత్రమే కాదు.. ప్రాసెస్ చేసిన మాంసం కూడా క్యాన్సర్‌కు కారణమవుతుందని తేలింది. WHO , క్యాన్సర్ రీసెర్చ్ UK రెండూ దీనిని “గ్రూప్ 1 కార్సినోజెన్” గా జాబితా చేశాయి. అంటే దీనికి క్యాన్సర్‌తో ప్రత్యక్ష సంబంధం ఉంది.
ప్రాసెస్ చేసిన మాంసం అంటే ఏమిటి ?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రాసెస్ చేసిన మాంసం అంటే ఉప్పు ఎక్కువగా వేయడం, క్యూరింగ్ చేయడం, రుచిని పెంచడానికి ఇతర ప్రక్రియల ద్వారా మార్చబడిన మాంసం.
సాధారణ బీపీ ఎంత ఉండాలి ?
సాధారణ రక్తపోటు: 120/80 mmHg కంటే తక్కువ
కాస్త పెరిగడం: 120–129 / 80 mmHg
దశ 1 రక్తపోటు: 130–139 / 80–89 mm Hg
దశ 2 రక్తపోటు: 140+/90+ mm Hg
180/120 mmHg పైన: అత్యవసర పరిస్థితి
Also Read: మీరు తిన్న వెంటనే ఈ 5 పనులు చేస్తున్నారా ? చాలా ప్రమాదం
అధిక రక్తపోటు: ఏమి చేయాలి, ఏమి చేయకూడదు ?
– తక్కువ ఉప్పు ఆహారం తీసుకోండి.
– పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తినండి
– వ్యాయామాన్ని మీ దినచర్యలో భాగంగా చేసుకోండి
– ఒత్తిడిని తగ్గించుకోండి. ధ్యానం, యోగా చేయండి.
చేయకూడనివి:
– ప్రాసెస్ చేసిన మాంసాహారం నివారించండి
– వేయించిన లేదా అధిక ఉప్పు ఉన్న ఆహారాలను నివారించండి
– మద్యం , ధూమపానం మానుకోండి
అధిక రక్తపోటు ప్రమాదకరమైనది కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. చిన్న అలవాట్లు మీకు దీర్ఘాయుష్షువును ఇస్తుంది.