Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నెక్స్ట్ మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరో నెల రోజుల్లో థియేటర్లలోకి అంటూ తాజాగా మహేష్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు. మరి నెల రోజుల్లో ఏం జరగబోతోంది? మహేష్ బాబు ఏ మూవీ గురించి మాట్లాడారు ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఎస్ఎస్ఎంబి 29’ అనే పాన్ వరల్డ్ సినిమాకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి నుంచి ఈ సినిమా మొదలు కాబోతోందని ప్రచారం జరుగుతుంది. చాలాకాలం నుంచి మహేష్ బాబు ఈ మూవీ కోసం ప్రిపరేషన్ లో బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘ఎస్ఎస్ఎంబి 29’ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే జక్కన్న సినిమా అంటే ఏళ్ల తరబడి సాగుతుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
రాజమౌళితో ఒక హీరో సినిమా చేస్తున్నాడు అంటే అది చాలా పెద్ద విషయమే. కానీ జక్కన్న సినిమా అంటే ఇలా ఒక గుడ్ న్యూస్ తో పాటు అభిమానులు నిరాశ పడే మరో విషయం కూడా ఉంటుంది. అదేంటో కాదు జక్కన్న సినిమా అయిపోయే వరకు, తన సినిమాలో నటిస్తున్న సదరు స్టార్ హీరో మరో సినిమాలో నటించే అవకాశం ఉండదు. అంటే తాము అభిమానించే హీరోలు జక్కన్న సినిమా ఎన్నేళ్లు సాగితే, అన్నేళ్లు మరో సినిమాలో కనిపించరు. ఇప్పుడు మహేష్ బాబు (Mahesh Babu) విషయంలో కూడా అదే జరుగుతుంది. రాజమౌళితో మహేష్ బాబు సినిమా ఉంటుందని వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన చాలావరకు బయట కనిపించట్లేదు. ఇక ఈ సినిమా ఇంకా మొదలవ్వనే లేదు. ఒకవేళ మొదలయితే ఎన్నేళ్లు పడుతుందో తెలీదు. ఇలాంటి తరుణంలో తాజాగా మహేష్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు. అయితే అది ఆయన హీరోగా నటిస్తున్న సినిమా గురించి కాదు.
హాలీవుడ్ సినిమా “ముఫాసా – ది లయన్ కింగ్” గురించి. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ “ముఫాస : ది లయన్ కింగ్” (Mufasa : The Lion King). క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 24 రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో ‘ముఫాస’ అనే ఐకానిక్ పాత్రకు తెలుగులో మహేష్ బాబు డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ చాలా రోజుల క్రితమే రిలీజ్ అయింది. ఇందులో బ్రహ్మానందం కూడా ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ కు కేవలం మరో నెల రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో, మహేష్ బాబు సోషల్ మీడియాలో ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేకంగా పోస్ట్ చేశారు. ‘లయన్ కింగ్’గా త్వరలోనే మహేష్ బాబు థియేటర్లలో తన వాయిస్ తో అలరించబోతున్న నేపథ్యంలో, ఆయన చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.