
SSMB 28 :- సూపర్‌స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్య దేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత ఏడాదిలోనే ఓ చిన్నపాటి షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. తర్వాత ఇంత వరకు సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయనేలేదు. దీంతో సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌లో తెలియని క్యూరియాసిటీ వచ్చేసింది. అసలేం జరుగుతుందంటూ ఆరాలు తీయటం.. సోషల్ మీడియాలో నిర్మాతలను అడగటం మొదలెట్టేశారు.
మహేష్ బాబు కుటుంబంలో జరిగిన విషాదాల కారణంగా SSMB 28 షెడ్యూల్ ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు నిర్మాత సూర్య దేవర నాగ వంశీ SSMB 28 కి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చేశారు. జనవరి 18 నుంచి కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుందని, ఆగస్ట్ 11న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని తెలిపారు. పనిలో పనిగా హీరోయిన్స్ విషయంలోనూ ఆయన క్లారిటీ ఇచ్చేశారు. SSMB 28లో ఇద్దరు హీరోయిన్.. పూజా హెడ్గే, శ్రీలీల నటిస్తున్నారన్నారు. అయితే తామెవరికీ మెయిన్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్ అనే ర్యాంకింగ్స్ ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఏదైతేనేం నిర్మాత నుంచి పక్కా క్లారిటీ రావటంతో మహేష్ ఫ్యాన్స్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
Follow this link for more updates:- Bigtv