Unstoppable With NBK : బాలకృష్ణ నిన్న మొన్నటి వరకు ఎక్కువ కోపంగా ఉంటాడని , ఫాన్స్ తో సరిగా బిహేవ్ చేయడని నానా రకాలుగా మాట్లాడిన వాళ్లు కూడా ఈరోజు బాలయ్య బాబు టాక్ షో లను ఎంతో ఇష్టపడి చూస్తున్నారు. బాలకృష్ణకు ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టిన ఒకే ఒక టాక్స్ షో ‘అన్ స్టాపబుల్’. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షో వరుసగా ఎందరో సెలబ్రిటీల ఇంటర్వ్యూలు ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఇక ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక బాలయ్య ఎపిసోడ్ అంటే.. రచ్చ మామూలుగా ఉండదు. సమాధానం చెప్పలేని ప్రశ్నలను అందంగా అడిగి బాగా కన్ఫ్యూజ్ చేయడంలో బాలయ్య దిట్ట అన్న విషయం అందరికీ అర్థమయిపోయింది. మొన్నటికి మొన్న యానిమల్ టీం తోపాటు వచ్చిన రష్మికను స్టేజ్ పై బాలయ్య భలే బుక్ చేశాడు. ప్రోమో లో వచ్చిన ఈ చిన్న క్లిప్ చూసి ఎపిసోడ్ ని ఎంతోమంది చూశారు. మరి ఈసారి ఈ షో కి వచ్చే గెస్ట్ లు ఎవరో తెలిస్తే అందరికీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..
సంక్రాంతి బరిలో ఉన్న అన్ని సినిమాల్లోకి రేసులో ముందంజలో ఉన్నది గుంటూరు కారం. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ పై బాగా కాన్సెంట్రేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెక్స్ట్ బాలయ్య అన్ స్టాపబుల్ షోకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గెస్ట్ గా రాబోతున్నారు. త్రివిక్రమ్ తోపాటుగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ షోలో బాలయ్యతో కనిపిస్తాడు.
ఈ ఇద్దరి కాంబినేషన్లో మరొక టాక్ షో చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఇంతకుముందు సోలోగా మహేష్ బాబు బాలయ్య టాక్ షో కి హాజరైన సంగతి తెలిసిందే. అప్పట్లో తన ప్రశ్నలతో మహేష్ ను ఓ రేంజ్ లో బాలయ్య తికమక పెట్టాడు. మహేష్ కూడా ఈ టాక్ షోలో తనదైన అల్లరి చేశాడు. బాలయ్య చమత్కారం ఒకపక్క అయితే.. చల్లని సెటైర్లతో.. మెల్లని పంచులతో మహేష్ బాబు ముచ్చట్లు మరొకపక్క అన్నట్లు సాగింది ఆ ఎపిసోడ్. మరి ఇప్పుడు మహేష్ కి తోడుగా మాటలు మాంత్రికుడు కూడా వస్తున్నాడు. దీంతో ఈ షోపై ఆసక్తి మరింత పెరిగింది. ఇక ఈ షో కి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.