BhajanLal Sharma | దేశంలోని అయిదు రాష్ట్రాల్లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే అయిదింటిలో బిజేపీ మూడు రాష్ట్రాల్లో అనూహ్య విజయం సాధించింది. కానీ బిజేపీ అసలు రాజకీయాలు ఎన్నికల తరువాత మొదలయ్యాయి. గెలిచిన మూడు రాష్ట్రాల్లో కూడా అసలు ఎవరూ ఊహించని నాయకులని ముఖ్యమంత్రులుగా ప్రకటించింది.
దేశంలోని అయిదు రాష్ట్రాల్లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే అయిదింటిలో బిజేపీ మూడు రాష్ట్రాల్లో అనూహ్య విజయం సాధించింది. కానీ బిజేపీ అసలు రాజకీయాలు ఎన్నికల తరువాత మొదలయ్యాయి. గెలిచిన మూడు రాష్ట్రాల్లో కూడా అసలు ఎవరూ ఊహించని నాయకులని ముఖ్యమంత్రులుగా ప్రకటించింది.
ఈ మూడు రాష్ట్రాల్లోనూ రాజస్థాన్‌లో మరీ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రిగా నియమించడం ఒక సంచలనం. పైకి ఎమ్మెల్యే సమావేశంలో ఆయనను అందరూ ఏకగ్రీవంగా ఎన్నకున్నట్లు కనిపించినా.. ఇదంతా బిజేపీ ఢిల్లీ పెద్దల నిర్ణయం మేరకే జరిగింది.
భజన్ లాల్ శర్మ ఎవరు?
56 ఏళ్ల భజన్ లాల్ శర్మ రాజస్థాన్‌లోని భరత్ పూర్ జిల్లాకు చెందిన వారు. అందుకే ఆయనకు భరత్ పూర్ జిల్లా సాంగానేర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బిజేపీ టికెట్ ఇచ్చింది. ఆయన రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు.
భజన్ లాల్ శర్మ ఒక సంపన్న కుటుంబానికి చెందినవారు. ఆయన తండ్రి పేరు కృష్ణ స్వరూప్ శర్మ. ఆయన మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.147 కోట్లు. ఆయనకు రూ.35లక్షల అప్పులున్నాయి.
రాజస్థాన్ రాజకీయాల్లో ఆయన పాత్ర
భజన్ లాల్ శర్మకు రాజస్థాన్ బిజేపీలో మహామంత్రి స్థానం ఉంది. అంటే బిజేపీ రాజస్థాన్ పార్టీ ప్రధాన కార్యదర్శి. రాజస్థాన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శిని మహామంత్రి అని అంటారు. ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి సారి పోటీ చేశారు.
ఎన్నికల్లో భజన్ లాల్ శర్మ సాంగానేర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తన సమీప అభ్యర్థి కాంగ్రెస్ నాయకుడు పుష్పేంద్ర భరద్వాజ్‌పై 48వేల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
భజన్ లాల్ శర్మకు ఆర్ఎస్ఎస్ (RSS)తో మంచి అనుబంధం ఉంది. ఆయన ఇంతకుముందు విద్యార్థిదశలో ఏబివిపి(ABVP)నాయకుడిగా వ్యవహరించారు. రాజస్థాన్ బిజేపీలో ఆయన వెంట నడిచే వారు భారీ సంఖ్యలో ఉన్నారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఆయన తొలిసారిగా నియమితులయ్యారు. ఆయన మంత్రివర్గంలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు.. దియా కుమారి, ప్రేమ్ చంద్ర బైర్వా నియమితులయ్యారు.