BigTV English

Mahesh Babu : చిన్నారికి మహేష్ అండ.. తప్పిన ముప్పు

Mahesh Babu : చిన్నారికి మహేష్ అండ.. తప్పిన ముప్పు

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ తన దాతృత్వాన్ని చాటుకుంటూనే ఉన్నారు. రీసెంట్ టైమ్స్‌లో మ‌హేష్ తండ్రి కృష్ణ‌.. త‌ల్లి ఇందిరా దేవి క‌న్నుమూశారు. అంత దుఃఖం నుంచి మ‌హేష్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మ‌హేష్ కృష్ణ ఆరోగ్యం స‌రిగా లేని స‌మ‌యంలో త‌న ఛారిటీని ఆప‌లేదు. ఓ చిన్నారి గుండె ఆప‌రేష‌న్‌కు సాయం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ సంఘ‌ట‌న‌ను మ‌రచిపోక ముందే మ‌రో చిన్నారికి త‌న ఫౌండేష‌న్ ద్వారా ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక సాయం అందించారు మ‌హేష్‌. వివ‌రాల్లోకి వెళితే, ఆదిలాబాద్ జిల్లాలోని సిర్స‌న్న గ్రామానికి చెందిన 10 నెల‌ల చిన్నారి క‌న‌కాల వ‌ర్ష పుట్టుక నుంచి గుండె సంబంధిత వ్యాధితో బాధ ప‌డుతుంది. ఈ విష‌యాన్ని హైద‌రాబాద్‌లోని ఎంప్లాయిస్‌ హెల్త్ స్కీమ్ అధికారికి దృష్టికి తీసుకెళ్లారు. ఆయ‌న ద్వారా మ‌హేష్ వ‌ర‌కు విష‌యం తెలిసింది. ఆయ‌న త‌న ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేష‌న్ ద్వారా రూ.5 ల‌క్ష‌లు ఆర్థిక సాయం చేశారు. దీంతో ఆప‌రేష‌న్ స‌క్సెస్‌ఫుల్‌గా జ‌రిగింది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఈ వారంలోనే మ‌హేష్ త‌న 28వ సినిమా సెకండ్ షెడ్యూల్‌ను త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ట్ చేయ‌బోతున్నారు. ఈ సినిమా కోసం సూప‌ర్ స్టార్ సిక్స్ ప్యాక్ లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. అత‌డు, జ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్ చేస్తోన్న మూడో చిత్ర‌మిది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా క‌నిపించ‌నుంది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర రాధా కృష్ణ (చిన‌బాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×