Mahesh Babu : టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ మూవీ కోసం అటు ఫ్రెండ్స్ అభిమానులు ఇటు యావత్ సినీ అభిమానులు చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆత్రుత కనబరుస్తుంటారు. అయితే రాజమౌళితో సినిమా అంటే కాస్త ఆలస్యమైనా కూడా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుంది అన్న నమ్మకం అందరికీ ఉంది. అదేవిధంగా మహేష్ బాబు విషయంలో కూడా జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ అది రివర్స్ అయినట్టు తెలుస్తుంది.. సెట్స్ మీద రాజమౌళి సినిమా ఉండగానే మరో సినిమాకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. క్రేజీ డైరెక్టర్ తో మరో సినిమాను లైన్లో పెట్టినట్లు ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం.
రాజమౌళి – మహేష్ బాబు మూవీ..
దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో మూవీ చెయ్యాలని స్టార్ హీరోలు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. త్రిపుల్ ఆర్ మూవీ తర్వాత ఆయన క్రేజ్ పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఆయన సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు అంటే మామూలు విషయం కాదు. ఈయనతో సినిమా చేసిన తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేయాలని హీరోలు తర్జనభజన అవుతుంటారు.. రాజమౌళి సినిమా అంటే తప్పకుండా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే ప్రాజెక్టే. అందులో అనుమానం ఏం లేదు. అలాంటి సినిమా తరవాత మహేష్ ఏం చేస్తాడన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది. నిజానికి రాజమౌళి సినిమా ఎప్పుడు పూర్తవుతుందో అన్నది చెప్పడం కష్టమే. కానీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. మరో సినిమా కథలను వినడం నచ్చితే ఓకే చేయడం అన్నీ జరిగిపోతాయి. కానీ వేరొక సినిమా చేయాలి అంటే ఈ సినిమా పూర్తి అయిన తర్వాతే అన్న విషయం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు విషయంలో కూడా అదే సందిగ్ధం ఏర్పడింది. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడు అని సినీ అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.. అయితే తాజాగా మహేష్ బాబు క్రేజీ డైరెక్టర్ తో మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.. ఆ డైరెక్టర్ ఎవరంటే..?
Also Read : ఆ ఒక్కటి అడక్కు..నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న సుమక్క..
ఉప్పెన డైరెక్టర్ తో మహేష్ మూవీ..?
ఇండస్ట్రీ లోకి డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ మూవీ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్‌ని నెక్ట్స్ లెవల్‌లో చూపించే ప్రయత్నాల్లో బుచ్చి ఉన్నాడన్నది ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మహేష్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి కనీసం మరో ఏడాది పట్టే అవకాశాలు ఉన్నాయి. అటు బుచ్చిబాబు కూడా రామ్ చరణ్ తో పెద్ది మూవీ చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ తర్వాత మహేష్ బాబుతో మూవీని పట్టాలెక్కించేa అవకాశం ఉందని తెలుస్తుంది. చూడాలి మరి..