BigTV English
Advertisement

OTT Movie : అమ్మాయిల్ని ఇంత క్రూరంగా… శాపాన్ని పోగొట్టే శక్తి ఆ ఒక్క పాపకే

OTT Movie : అమ్మాయిల్ని ఇంత క్రూరంగా… శాపాన్ని పోగొట్టే శక్తి ఆ ఒక్క పాపకే

OTT Movie : ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అందులోనూ ఓటీటీలో వణుకు పుట్టించే సినిమాలు చాలానే ఉన్నాయి. భయమేసినా సరే అలాంటి సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేయడాన్ని ఇష్టపడే వారి సంఖ్య కోకొల్లలు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ అంతగా భయపెట్టించకపోయినా, స్టోరీతో మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా చిన్నపిల్లలతో సహా, కుటుంబ సభ్యులంతా కలసి చూసే విధంగా ఉంటుంది. ఒక్కసారి చూడడం మొదలు పెడితే ఆపరు. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో

ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘కాలీ ఖుహీ’ (Kaali Khuhi). ఈ సినిమాకి టెర్రీ సముద్రా దర్శకత్వం వహించారు. దీనిని అంకు పాండే, రామన్ చిబ్ నిర్మించారు. ఇందులో షబానా అజ్మీ, సంజీదా షేక్, రివా అరోరా, సత్యదీప్ మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ పంజాబ్‌ లోని ఒక గ్రామంలో జరిగే ఆడపిల్లల హత్యల చుట్టూ తిరుగుతుంది. ఈ స్టోరీలో పది సంవత్సరాల శివాంగి అనే బాలిక శాపగ్రస్తమైన ఒక గ్రామాన్ని, ఆత్మల నుంచి కాపాడటానికి ప్రయత్నిస్తుంది. ఈ హారర్ సినిమా 2020 అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో విడుదలైంది. ఇంకా చూడకపోతే వెంటనే ఓ లుక్కేయండి.


స్టోరీలోకి వెళితే

శివాంగి తన తల్లిదండ్రులు దర్శన్, ప్రియాతో కలిసి, అనారోగ్యంతో ఉన్న అమ్మమ్మను చూసేందుకు పంజాబ్‌ లోని ఒక గ్రామానికి వస్తుంది. గ్రామంలోకి అడుగు పెట్టినప్పటి నుండి, శివాంగికి వింత సంఘటనలు ఎదురౌతాయి. ఆమె తన అమ్మమ్మ ఇంట్లో ఒక ఆత్మని కూడా చూస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది శివాంగి. ఈ క్రమంలో ఆ గ్రామంలోని ఒక పాత బావిలో, అమ్మాయిలను క్రూరంగా చంపి పడేశారని తెలుసుకుంటుంది. చిన్న పిల్లల నుంచి, పెళ్ళి కాని పిల్లల వరకూ అందులో చంపి ఉంటారు. ఈ హత్యల కారణంగా ఆ గ్రామం శాపగ్రస్తమై, చనిపోయిన అమ్మాయిల ఆత్మలు గ్రామస్తులను ఇబ్బంది పెడుతుంటాయి.

Read Also : ఓటీటీలోకి రాబోతున్న కొత్త మలయాళ థ్రిల్లర్… ఐఎమ్‌డీబీలో 8.3 రేటింగ్‌… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఆ గ్రామంలోని సత్య మాసి అనే ఒక వృద్ధ మహిళకు వీటి గురించిన అన్ని విషయాలు తెలిసుంటాయి. సత్య మాసి ఈ శాపం గురించి శివాంగికి చెప్తుంది. ఈ శాపాన్ని ఎదుర్కోవడానికి శివాంగితో పాటు ఆమె తల్లి ప్రియ, వృద్ధ మహిళ సత్య మాసి కలిసి పని చేస్తారు. చివరికి ఆ గ్రామానికి పట్టిన శాపం పోతుందా ? ఆడపిల్లల్ని ఎందుకు చంపుతున్నారు ? శివాంగి ఈ ఆత్మలను ఎలా ఎదుర్కుంటుంది ? ఆ ఊరికి పట్టిన శాపం పోతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×