Suma Kanakala : బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సుమా కనకాల.. ప్రస్తుతం టాప్ యాంకర్ గా కొనసాగుతున్న వారిలో మొదటగా వినిపించే పేరు సుమా కనకాల.. ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఈవెంట్ జరిగినా సుమ ఉండాల్సిందే. ఎందుకంటే ఆమె హోస్టుగా చేసిన ప్రతి షో గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో పాటు మూవీ కూడా హిట్ అవ్వడంతో ఎన్ని లక్షలు ఖర్చయినా పర్లేదు గాని సుమతోనే ఈవెంట్ చేయాలని దర్శక నిర్మాతలు కూడా ఆలోచిస్తుంటారు. అటు బుల్లితెరపై ప్రస్తుతం ప్రసారమవుతున్న పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తుంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా హీరోయిన్ మించిన ఫాలోయింగ్ సుమకు ఉంది. ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా కొనసాగుతున్న సుమ గురించి చాలామంది తెలుసుకోవాలని గూగుల్ లో తెగ వెతికేస్తుంటారు. ముఖ్యంగా సుమ రెమ్యూనిరేషన్ గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు.. అయితే ప్రస్తుతం ఒక షో కి సుమ ఎంత ఛార్జ్ చేస్తుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
సుమ రెమ్యూనరేషన్..
బుల్లితెర లెజెండరీ యాంకర్ సుమ మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కూడా తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు తగ్గట్లు ఆమె తీరు ఉండటంతో ఎక్కువగా ఫ్యామిలీలు సుమకు ఫ్యాన్లు అయిపోతున్నారు. గత కొన్నేళ్లుగా తన హవాని కొనసాగిస్తున్న సుమ రెమ్యూనరేషన్ గురించి చాలామందికి తెలియదు. యాంకర్ సుమ కనకాల ఒక్కో ప్రోగ్రాం లేదా ఈవెంట్ కి 2 నుంచి 2.5 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం. కొందరు ఆమె ఒక్కో ప్రోగ్రాంకి 3 లక్షల నుండి 5 లక్షల వరకు కూడా వసూలు చేస్తుందని చెబుతున్నారు. ఈ విధంగా చూస్తే ఆమె నెల ఎలా లేదన్నా 9 లేదా అంతకన్నా ఎక్కువగా ఈవెంట్స్ చేస్తుంది. ఎలా లేదనుకున్న నెలకు ఒక 20 లక్షల వరకు ఆమె సంపాదన ఉంటుందని తెలుస్తుంది. ఈమెతో పాటు ఈమె భర్త రాజీవ్ కనకాల కూడా పలు సినిమాలో కీలకపాత్రలో నటిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. అదేవిధంగా వీళ్ళకు ఒక యాక్టింగ్ స్కూల్ కూడా ఉందన్న విషయం తెలిసిందే.. ఇక సుమ ఇంటిని పలు సినిమాలకు రెంటుకిస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. దానికి కూడా మంచిగానే రెంట్ వస్తుంది. మొత్తానికి సుమ సంపాదన నెలకు లక్షల్లో ఉంటుందని స్పష్టమవుతుంది.
సుమ పర్సనల్ లైఫ్..
యాంకర్ సుమ ఎంత పెద్ద ఈవెంట్ అయినా యాంకర్ సుమ.. రెండు గంటలకంటే ఎక్కువ ఉండదు. ముందు ఆడియన్స్‌తో మాట్లాడటానికి.. బైట్స్ లాంటి వాటికి వేరే యాంకర్ ఉండాల్సిందే. టైట్ కాల్ షీట్స్ ఉన్నప్పుడు ఏదైనా పెద్ద ఈవెంట్ చేయాల్సి వస్తే దానికి తగ్గట్లే రెమ్యూనరేషన్ వసూల్ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్. యాంకర్లకు డిక్షనరీ లాంటిది యాంకర్ సుమ కనకాల. ఇప్పటి వరకూ తెలుగులో చాలామంది యాంకర్లు వచ్చారు.. వెళ్లారు. మహా అయితే కాదంటే పదేళ్లు వాళ్ల హవా నడిచింది. కానీ యాంకర్ సుమ.. హవా కంటిన్యూ అవుతూనే ఉంది. తన వాక్చాతుర్యంతో ఆడియన్స్‌ని కట్టిపడేస్తుంది.. మలయాళ కుట్టి అయిన ఈమె రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టారు. సుమ కొడుకు రోషన్ కనకాల ఇటీవలే సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమా యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. దాంతో ప్రస్తుతం తన రెండో సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రోషన్. మరి ఈ సినిమా అయినా అతనికి మంచి హిట్ టాక్ ని అందిస్తుందేమో చూడాలి..