BigTV English

Prabhas – Mahesh : ప్ర‌భాస్‌ని ఢీ కొట్ట‌నున్న మ‌హేష్‌.. ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్న సంక్రాంతి పోరు

Prabhas – Mahesh : ప్ర‌భాస్‌ని ఢీ కొట్ట‌నున్న మ‌హేష్‌.. ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్న సంక్రాంతి పోరు
Prabhas - Mahesh

Prabhas – Mahesh : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మొన్న‌నే ఈ ఏడాది సంక్రాంతి పోరు ముగిసింది.అలా ముగిసిందో లేదో అప్పుడే వ‌చ్చే ఏడాది సంక్రాంతి పోరుపై చ‌ర్చ మొద‌లైంది. 2024 సంక్రాంతి పోటీలో వ‌చ్చే స్టార్స్ ఎవ‌రా? అని ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే ఈ రేసులో ముందుగా ప్ర‌భాస్ బెర్తుని ఫిక్స్ చేసుకున్నారు. ప్రాజెక్ట్ K మూవీ జ‌న‌వ‌రి 12న రిలీజ్ అవుతుంద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇంకా ఈ రేసులో ప్ర‌ముఖంగా వినిపిస్తోన్న మ‌రో స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్‌. ఈయ‌న శంక‌ర్ దర్శ‌క‌త్వంలో నటిస్తోన్న RC 15 కూడా సంక్రాంతికే రిలీజ్ అవుతుంద‌ని టాక్.


ఈ నేప‌థ్యంలో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా 2024 సంక్రాంతి బ‌రిలోకి దిగుతున్నారు సూప‌ర్ స్టార్ మ‌హేష్. ఆయ‌న ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కొన్ని కార‌ణాల‌తో వాయిదా ప‌డింది. చివ‌ర‌కు ఆగ‌స్ట్ 11న SSMB 28న రిలీజ్ చేద్దామ‌ని నిర్మాత‌లు భావించారు. అయితే చిత్రీక‌ర‌ణ మ‌రింత ఆల‌స్యం అవుతుండ‌టంతో SSMB 28 రిలీజ్ ఆగ‌స్ట్ 11న కూడా రిలీజ్ కావ‌టం లేద‌నేది స్ప‌ష్ట‌మైంది.

ఈ క్ర‌మంలో SSMB 28 సినిమా ద‌స‌రాకు రిలీజ్ అయ్యే అవ‌కాశాలున్నాయ‌ని టాక్ వ‌చ్చింది. అయితే కొంద‌రు మాత్రం మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ మూవీ ద‌స‌రాకు రిలీజ్ కావ‌టం లేద‌ని, 2024 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. అది కూడా జ‌న‌వ‌రి 12నే అని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. అంటే ప్ర‌భాస్ మూవీ రిలీజ్ రోజునే మ‌హేష్ 28 సినిమా రిలీజ్ అవుతుంద‌ని స‌మాచారం. మ‌రి ఈ న్యూస్‌పై మేక‌ర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×