Devi Sri Prasad: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ (Devi Sri Prasad). వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న దేవిశ్రీప్రసాద్ కి తాజాగా బ్యాడ్ టైం మొదలైందనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘పుష్ప 2’. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని పాటలకు మ్యూజిక్ అందించిన ఈయనకు మైత్రి మూవీ మేకర్స్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
దేవిశ్రీప్రసాద్ కి షాక్ ఇచ్చిన మేకర్స్..
ముఖ్యంగా ఈ సినిమాకు మ్యూజిక్ స్కోర్ త్వరగా పూర్తిచేసి, డిసెంబర్ 5వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగానే దేవి శ్రీ ప్రసాద్ తో పాటు మరో ముగ్గురు సంగీత దర్శకులను రంగంలోకి దింపి, ఒక్కొక్కరికి ఒక్కో పోషన్ ఇచ్చి సంగీతాన్ని అందివ్వమని చెప్పారు. అయితే ఇది ఒక రకంగా దేవిశ్రీప్రసాద్ కి షాక్ అనే చెప్పాలి. ఇదిలా ఉండగా తమన్ (Thaman)కూడా ఈ సినిమాలో ఒక భాగం అని, తనకు ఇచ్చిన పోషన్ కంప్లీట్ చేశాను అని తెలిపారు. మరోవైపు సామ్ సి ఎస్ (Sam CS) ని కూడా రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. సినిమాలో అత్యంత కీలకమైన ‘గంగమ్మ జాతర’ సీక్వెన్స్ కి దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఇస్తున్నారని, అందరూ అనుకున్నారు. కానీ ఆయనను తప్పించి, తమన్ ను రంగంలోకి దింపారు. అయితే ఇప్పుడు ఆయనను కూడా కాదని సామ్ సీ.ఎస్. కు అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే.
దెబ్బ మీద దెబ్బ..
ఇదిలా ఉండగా సినిమాకే హైలెట్ గా నిలవనున్న గంగమ్మ జాతర సీక్వెన్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్న దేవిశ్రీప్రసాద్ కి, ఇది పెద్ద షాక్ అని చెప్పాలి. అయితే ఇప్పుడు మరో పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి. అసలు విషయంలోకి వెళ్తే, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తమిళంలో అజిత్ (Ajith) నటిస్తున్న చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా కోలీవుడ్ నుంచి ఒకే ఒక్క సినిమా పోటీలోకి దిగబోతోంది. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు.
అజిత్ మూవీ నుంచి కూడా తప్పించారుగా..
అయితే ఏమైందో తెలియదు కానీ దేవిశ్రీప్రసాద్ ను ఈ సినిమాకు కొనసాగించడానికి మేకర్స్ ఆసక్తి చూపించలేదనే వార్త వినిపిస్తోంది. అందుకే ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం జీ.వి. ప్రకాష్ కుమార్(GV.Prakash kumar)ను ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ విషయాన్ని జీవి ప్రకాష్ కుమార్ కూడా ధ్రువీకరించారట.. ఇటీవల ఈయన హీరోగా నటించిన ‘డియర్’ సినిమాతో పాటు హిందీలో తంగలాన్,అమరన్, లక్కీ భాస్కర్, మట్కా, సర్ఫిరా వంటి సినిమాలకు సంగీతాన్ని అందించారు. అయితే తంగలాన్ యావరేజ్ టాక్ తెచ్చుకోగా.. అమరన్, లక్కీ భాస్కర్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దీంతో ఈయనకు అవకాశాలు మళ్లీ తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం ఈయన చేతిలో పది సినిమాలు ఉన్నాయి. దీనికి తోడు ఇప్పుడు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాకి కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ కి బ్యాడ్ టైం నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈయన నాగచైతన్య (Naga Chaitanya) ‘తండేల్ ‘ సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా కనుక కమర్షియల్ గా సక్సెస్ అయితే ఇక ఈయన అదృష్టం మళ్ళీ తిరిగినట్టే అని చెప్పవచ్చు.