BCCI – Mohammed Shami: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమికి ( Mohammed Shami ) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి డెడ్ లైన్ విధించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI ). బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 సిరీస్ లోకి మహమ్మద్ షమీ వచ్చేందుకు… కొన్ని కండిషన్స్ పెట్టింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ప్రస్తుతం సయ్యద్ ముస్తక్ అలీ టీ20 టోర్నమెంట్ ఆడుతున్నాడు టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ.
Also Read: Rishabh Pant IPL Salary: రిషబ్ పంత్ కు షాక్.. రూ. 27 కోట్లలో భారీ కోత..40 శాతం పోతాయి?
అయితే ఈ టోర్నమెంటులో మహమ్మద్ షమీకి ( Mohammed Shami )టెస్టులు నిర్వహించనున్నారు. ప్రతి స్పెల్ లో మహమ్మద్ షమీ బరువు పైన టెస్టులు నిర్వహిస్తారట. దీనికోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి మెడికల్ టీం రంగంలోకి దిగబోతుంది. ప్రస్తుతం టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అధిక బరువుతో ఉన్నారట. అతను బౌలింగ్ చేస్తున్న క్రమంలో బరువు తగ్గితే…. కచ్చితంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సెలెక్ట్ అవుతాడని బీసీసీఐ అధికారులు తెలిపారు.
ఒకవేళ మరో పది రోజుల్లో తగినంత బరువు తగ్గి… ఫిట్నెస్ గా ఉండకపోతే మహమ్మద్ షమీ.. ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్ ఉంది. అతన్ని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సెలెక్ట్ చేయబోరన్నమాట. మూడవ టెస్టుకు మహమ్మద్ షమీ రంగంలోకి దిగుతారని కొంతమంది అంటున్నారు. అయితే ఆ టెస్టుకు మహమ్మద్ షమీ సెలెక్ట్ కావాలంటే కచ్చితంగా… బీసీసీఐ అధికారులు చెప్పిన రూల్స్ పాటించాల్సిందే.
Also Read: Sachin Tendulkar: కొడుకు కోసం సచిన్ అలా చేశాడా? సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్
అయితే బిసిసిఐ పాలకమండలి… పెట్టిన డెడ్లైన్ నేపథ్యంలో మహమ్మద్ షమీ ఫిట్నెస్ పైన దృష్టి పెట్టాడు. ఎలాగైనా ఫిట్నెస్ సంపాదించి మూడవ టెస్టుకు.. ఛాన్స్ కొట్టేస్తాడు అని అంటున్నారు మహమ్మద్ షమీ ఫాన్స్. ఒకవేళ మూడవ టెస్టుకు షమీ సెలెక్ట్ కాకపోతే… సిరీస్ మొత్తానికి దూరం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. మరి దీనిపై మహమ్మద్ షమీ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.
ఇది ఇలా ఉండగా… టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ కి మెగా వేలంలో భారీ వచ్చిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు గుజరాత్కు ఆడిన మహమ్మద్ షమీని.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది. ఏకంగా 10 కోట్లకు పైగా మహమ్మద్ షమీకి రేటు పెట్టి కావ్య పాప కొనుగోలు చేశారు. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నుంచి హైదరాబాద్ జట్టున ఆడబోతున్నాడు మహమ్మద్ షమీ.
వాస్తవంగా హైదరాబాద్ జట్టు బౌలర్గా భువనేశ్వర్ గత కొన్ని సంవత్సరాలు గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి భువనేశ్వర్ కుమార్ ను కాదని మహోత్సమైన కొనుగోలు చేసింది హైదరాబాద్ జట్టు. దీంతో అందరి దృష్టి మహమ్మద్ షమీ పైన పడింది.