E-Paper
Advertisement

NTR 30 Rumors : NTR 30 రూమర్స్‌పై మేకర్స్ క్లారిటీ.. స్టార్ టెక్నీషియన్స్ రంగంలోకి

NTR 30 Rumors : NTR 30 రూమర్స్‌పై మేకర్స్ క్లారిటీ.. స్టార్ టెక్నీషియన్స్ రంగంలోకి
Advertisement

NTR 30 Rumors : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది కానీ.. సినిమా షూటింగ్ మాత్రం స్టార్ట్ కావటమే లేదు. RRR రిలీజై ఇప్పటికే ఆరేడు నెలలు దాటేసిన తారక్ నెక్ట్స్ మూవీగా NTR 30ని స్టార్ట్ చేయకపోవటంపై సాధారణ ప్రేక్షకుల్లో ఏమో తెలియదు కానీ.. ఫ్యాన్స్ మాత్రం ఏం జరుగుతుందో తెలియక కంగారు పడ్డారు. ఒకానొక దశలో NTR 30 ఆగిపోయిందంటూ వార్తలు కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి.

అయితే NTR 30 సినిమాపై నెట్టింట వచ్చిన రూమర్స్‌కి మేకర్స్ చెక్ పెడుతూ చిత్ర యూనిట్ సభ్యులతో సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, అందులో భాగంగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ NTR 30లో భాగమవుతున్నారని అనౌన్స్ చేశారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్‌ని పూర్తిగా మార్చుకుని మరింత యంగ్‌గా కనిపిస్తున్నారు. పాన్ ఇండియా ఆడియెన్స్‌ని మెప్పించేలా ఎన్టీఆర్ 30 ఉంటుందనేది టాక్. మరి మేకర్స్ అధికారిక ప్రకటనలో ఏం చెప్తారో చూడాలి. ఈ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందనేది సమాచారం.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×