E-Paper
Advertisement

సముద్రంలో మునిగే యుద్ధనౌక… సైనికుల రక్తం కోసం వెంటాడే భారీ షార్క్‌… తెలుగులోనే ఈ గుండె జారిపోయే సర్వైవల్ థ్రిల్లర్

సముద్రంలో మునిగే యుద్ధనౌక… సైనికుల రక్తం కోసం వెంటాడే భారీ షార్క్‌… తెలుగులోనే ఈ గుండె జారిపోయే సర్వైవల్ థ్రిల్లర్
Advertisement

Shark Survival Thriller: సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. అందులోనూ సముద్రం మధ్యలో ఒక భారీ షార్క్ అటాక్ ఎలిమెంట్‌ తో స్టోరీ వస్తే ఇక స్క్రీన్ ముందు నుంచి కదలడం ఎవరివల్లా కాదు. అలాంటి ఒక నెక్స్ట్ లెవెల్ సస్పెన్స్ అండ్ హర్రర్ ఎలిమెంట్స్‌తో సాగే సినిమానే ‘బీస్ట్ ఆఫ్ వార్’ (Beast of War). ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉండటంతో తెలుగు ఆడియన్స్‌కు మరింత ఈజీగా, ఎఫెక్టివ్‌గా కనెక్ట్ అవుతుంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ కథలో శత్రువుల దాడి నుంచి తప్పించుకున్న సైనికులకు సముద్రంలో మరో భయంకరమైన ప్రమాదం ఎదురవుతుంది. చేతిలో ఆయుధాలు ఉండవు, సాయం చేయడానికి ఎవరూ రారు. చుట్టూ అంతులేని సముద్రం. మరి ఈ సర్వైవల్ థ్రిల్లర్ ను తెలుగులో ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

1942లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో… ఆస్ట్రేలియాకు చెందిన కొంతమంది సైనికులు యుద్ధరంగానికి వెళ్లేందుకు సముద్ర ప్రయాణం చేస్తుంటారు. టిమోర్ సముద్రం మీదుగా వెళ్తున్న వారి నౌకపై జపాన్ యుద్ధ విమానాలు ఒక్కసారిగా దాడి చేస్తాయి. క్షణాల్లో నౌక మంటల్లో చిక్కుకుని ధ్వంసమవుతుంది. ప్రాణాలు కాపాడుకోవడానికి సైనికులు సముద్రంలోకి దూకుతారు. నౌక శిథిలాల నుంచి దొరికిన వస్తువులతో ఒక తాత్కాలిక తెప్పను తయారు చేసుకుని దానిపైకి చేరతారు. కానీ అసలు ప్రమాదం అప్పుడే మొదలవుతుంది.

Advertisement

సముద్రం మధ్యలో చిక్కుకున్న ఆ సైనికులకు ఎప్పుడు సాయం అందుతుందో తెలియదు. ఎండ వేడి, దాహం, ఆకలి ఒకవైపు వేధిస్తుంటే… మరోవైపు శత్రువుల దాడి భయం వెంటాడుతుంది. ప్రాణభయంతో ఉన్న సైనికుల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలవుతాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం తగ్గిపోతుంది. అయితే వాళ్లు ఎదుర్కోవాల్సిన అతిపెద్ద ప్రమాదం నీటి పైన కాదు… నీటి అడుగున పొంచి ఉంటుంది. నౌక ధ్వంసమైన సమయంలో సముద్రంలో కలిసిన రక్తం వాసనకు ఆకర్షితమైన ఒక భారీ గ్రేట్ వైట్ షార్క్ ఆ సైనికుల చుట్టూ తిరుగుతుంటుంది.

మొదట దాని ఉనికిని గుర్తించరు ఆ సైనికులు, కానీ ఆ తర్వాత ఒక్కొక్కరిపై అది దాడి చేయడంతో భయంతో వణికిపోతారు. తెప్పపై ఉన్న కొద్దిపాటి స్థలంలోనే ఉండాలి. నీళ్లలోకి దిగితే షార్క్ దాడి చేసే ప్రమాదం ఉంది. అదే సమయంలో తెప్పపై ఎక్కువసేపు ఉండటానికి అవసరమైన ఆహారం, నీరు కూడా ఉండవు. ఈ పరిస్థితుల్లో లియో, విల్ వంటి సైనికులు తమ భయాలను పక్కన పెట్టి మిగతావాళ్లను కాపాడటానికి ప్రయత్నిస్తారు. ఇక షార్క్ దాడులు పెరుగుతున్న కొద్దీ తెప్పపై ఉన్నవాళ్ల సంఖ్య తగ్గుతుంది. శత్రువుల దాడి నుంచి బతికి బయటపడిన ఈ సైనికులు ప్రకృతి సృష్టించిన మరో మృత్యువుతో ఎలా పోరాడారు ? అందులో ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారు ? అనేదే మిగతా కథ.

ఓటీటీలో తెలుగులోనే స్ట్రీమింగ్

Advertisement

‘బీస్ట్ ఆఫ్ వార్’ అమెజాన్ ప్రైమ్ వీడియో (Jio Hotstar)లో అందుబాటులో ఉంది. తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ ఆడియో భాషలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి తెలుగు ప్రేక్షకులు తమకు నచ్చిన భాషలో చూసే అవకాశం ఉంది. దర్శకుడు కియా రోచె-టర్నర్ (Kiah Roache-Turner) ఈ సినిమాను యుద్ధం, హారర్, సర్వైవల్ అంశాలను కలిపి తెరకెక్కించారు. మార్క్ కోల్స్ స్మిత్, జోయెల్ నాంకెర్విస్, మాక్సిమిలియన్ జాన్సన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సముద్రంలో ఒంటరిగా చిక్కుకుపోతే ఎలా ఉంటుందో ఇందులో కళ్ళకు కట్టినట్టు చూపించారు.

Read Also: సముద్రంలో చిక్కుకున్న అన్నదమ్ములు… ముంచేయడానికి దూసుకొచ్చే పెను తుఫాను… గూస్ బంప్స్ తెప్పించే సర్వైవల్ థ్రిల్లర్

Related News

యాష్‌ ప్రాణాలకు ముప్పు… పికాచూ చేసిన పోరాటం చూస్తే ఎమోషనల్‌ అవ్వాల్సిందే… స్ట్రీమింగ్ తెలుగులోనే

దేవుడిని పరిచయం చేయడానికెళ్ళి డైరెక్ట్ గా దేవుడి దగ్గరకే… నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా

నవలల్లో రాసిన నిధి కోసమే రచయిత్రి కిడ్నాప్‌… అడవిలోకి వెళ్ళాక ఒక్కొక్కరికీ చుక్కలు

30 సెకన్ల ఇంధనంతో చంద్రుడిపై ల్యాండింగ్‌… ప్రాణాలకు తెగించి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చేసిన ప్రయాణం… మస్ట్ వాచ్ మూవీ

అప్పుల వేటలో బలి… కొడుకు కోసం ఆవేదన… కన్నీళ్లు పెట్టించే కథ

ఖైదీ అనుకుంటే కాలయముడే… సీక్రెట్ జైల్లో ఊచకోత… బ్లడీ బ్లడ్ బాత్

ఇన్నాళ్లూ తాజ్‌మహల్‌ గురించి మనం చదివింది నిజమేనా ? పుస్తకాలలో చెప్పని నిజాలు… ఈ కోర్టు రూమ్ డ్రామాను డోంట్ మిస్

Big Stories

Advertisement
×