BigTV English
Advertisement

Sardar 2: మరో లక్కీ ఛాన్స్ పట్టిన ‘మాస్టర్’ బ్యూటీ..

Sardar 2: మరో లక్కీ ఛాన్స్ పట్టిన ‘మాస్టర్’ బ్యూటీ..

Sardar 2: కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. పట్టంపోలే అనే సినిమాతో కెరీర్ ను ప్రారంభించిన మాళవిక.. మాస్టర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత వరుస అవకాశాలను అందుకుంటుంది కానీ, విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. విజయాపజయాలను లెక్కచేయకుండా అమ్మడు విజయం కోసం కష్టపడుతుంది.


ఇప్పటికే అమ్మడు నటించిన తంగలాన్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఇది కాకుండా మాళవిక.. తెలుగులో ప్రభాస్ సరసన రాజాసాబ్ సినిమాలో నటిస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలు కాకుండా మాళవిక మరో లక్కీ ఛాన్స్ పట్టేసింది. కార్తీ, రాశీ ఖన్నా జంటగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్దార్.

2022 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఒన్స్ ఏ స్పై.. ఆల్ వెస్ ఏ స్పై అనే ట్యాగ్ లైన్ తో రిలీజ్ అయిన సర్దార్ లో కార్తీ ఒక స్పై గా కనిపించాడు. ఇక అప్పుడే సర్దార్ 2 ను కూడా ప్రకటించారు. గతేడాది నుంచి సర్దార్ 2 సెట్స్ మీదకు వెళ్ళింది. ఇక ఈ మధ్యనే సర్దార్ 2 సెట్ లో ప్రమాదం జరిగి కొన్నిరోజులు షూటింగ్ ఆగిపోయిన విషయం తెల్సిందే.


ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలయ్యినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ నటిస్తుందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఈ విషయాన్నీ మాళవిక పోస్ట్ చేస్తూ.. “నా పుట్టినరోజు వారానికి ఉత్తమ ప్రారంభం. తమిళంలో నా తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. అది కూడా ఈ అద్భుతమైన బృందంతో. దీన్ని ప్రారంభించడానికి వేచి ఉండలేకపోతున్నా” అంటూ రాసుకొచ్చింది. మరి ఇందులో అమ్మడు స్పై గా కనిపిస్తుందో.. లేక స్పై తో రొమాన్స్ చేసే బ్యూటీగా కనిపిస్తుందో చూడాలి.

Related News

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Big Stories

×