BigTV English

Malavika Mohanan: అలాంటి ఫీలింగ్స్ లేవు నాకు..అనవసరంగా రచ్చ చేయొద్దు అంటోంది మాళవిక

Malavika Mohanan: అలాంటి ఫీలింగ్స్ లేవు నాకు..అనవసరంగా రచ్చ చేయొద్దు అంటోంది మాళవిక

Malavika Mohanan reply to fans support her in tollywood: తెలుగువారికి సుపరిచితం కాకపోయినా తమిళనాట టాప్ హీరోయిన్ గా రజనీకాంత్, విజయ్ మూవీస్తో సహా ధనుష్ నటించిన మారన్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే తెలుగులో హీరో ప్రభాస్ తో కలిసి రాజా సాబ్ మూవీలో నటించబోతోంది ఈ బ్యూటీ. మలయాళం మాతృభాష అయినా తమిళనాట రాణిస్తోంది. తొలి చిత్రం పట్టం పోలే. మలయాళంలో హీరోయిన్ గా చేసిన తొలి చిత్రం.తెలుగులో తనకు హీరో ప్రభాస్ సరసన నటించే అవకాశం రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. తెలుగులో ఎంట్రీ ఎలా ఇద్దామా అనుకుంటున్న తరుణంలో అనుకోని వరంలా రాజా సాబ్ అవకాశం వచ్చింది. దీనిని తాను అదృష్టంగా భావిస్తున్నానని అంటోంది. ఇందుకు అవకాశం ఇచ్చిన దర్శకుడు మారుతికి కృతజ్ణతలు చెబుతోంది.


తంగలాన్ ప్రమోషన్స్

ఆగస్టు 15న హీరో విక్రమ్ మూవీ తంగలాన్ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో విక్రమ్ మాళవిక ఓ కీలక పాత్ర పోషించింది. తంగలాన్ మూవీకి సంబంధించిన చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్న మాళవిక తంగలాన్ లో హీరో విక్రమ్ చాలా కష్టపడ్డారని..ఆ కష్టానికి తగినవిధంగా ఫలితం రావాలని కోరుకుంటున్నానని అంటున్నారు. చిట్ చాట్ లో పాల్గొన్న ఓ టాలీవుడ్ అభిమాని మాళవికను తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. మాళవిక తమిళ అభిమానులు అడిగే ప్రశ్నలకే సమాధానం ఇస్తోందని..తెలుగువారంటే అంత చులకనా అని అడిగేసరికి మాళవిక అవాక్కయ్యారు. దానితో రియాక్ట్ అయిన మాళవిక మీరు అలా మాట్లాడటం భావ్యం కాదు. నాకు తమిళం, తెలుగు అనే భాష బేధాలు లేవని అన్నారు.


తెలుగువారి ప్రేమ కావాలి

అలాంటి ఫీలింగ్స్ నాకే కాదు ఏ కళాకారులకూ ఉండవు. నాకూ తెలుగు ఫ్రెండ్స్ చాలా మందే ఉన్నారు. పైగా త్వరలోనే నేను ప్రభాస్ తో కలిసి తెలుగు సినిమాలో నటిస్తున్నాను. నా చిరకాల కోరిక నెరవేరబోతోంది. ఇంకా అవకాశం దొరికితే తెలుగులో సినిమాలు కంటిన్యూ చేయాలని చూస్తున్నాను. నేను టాలీవుడ్ కు రాకముందే నాపై ఇలాంటి అభాండాలు వేసి అనవసర రాద్దాంతం చేయొద్దు. తెలుగువారి ప్రేమ కూడా నాకు కావాలి అంటోంది మాళవిక.

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×