BigTV English

Nuclear-missile submarine INS Arighat: భారత నేవీ లో మరో పవర్ ఫుల్ వార్ న్యూక్లియర్ ‘అరిఘాత్’

Nuclear-missile submarine INS Arighat: భారత నేవీ లో మరో పవర్ ఫుల్ వార్ న్యూక్లియర్ ‘అరిఘాత్’

India set to commission its second nuclear-missile submarine INS Arighat: భారత నావికా దళాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఏ దేశానికైనా త్వరగా లింక్ చేసే వ్యవస్థ సముద్ర మార్గం ఒక్కటే. అందుకే అప్రమత్తంగా ఉంటే ఏ క్షణాన అయినా శత్రుదేశాలు సముద్ర మార్గం ద్వారా దాడులకు పాల్పడుతుంటారు. ఏ దేశానికైనా జలాంతర్గాములు ఉంటే ఇతర దేశాలు భయపడిపోతాయి. ఇప్పటికే భారత్ లో కె 4, కె 5 మిస్సైల్స్ ను అభివృద్ధి చేసింది. అయితే అణుశక్తితో రూపొందించిన జలాంతర్గాములు చాలా శక్తివంతమైనవి. ఇప్పటిదాకా భారత్ లో ఐఎన్ఎస్ చక్ర, అరిహంత్ మాత్రమే ఉన్నాయి. ఇప్పడు వీటి సంఖ్యను మరింతగా పెంచుకోవాలని భారత్ నేవీ దళం భావిస్తోంది.


పూర్తి స్వదేశీ టెక్నాలజీతో..

దాని ప్రకారమే రూపొందించిన న్యూక్లియర్ సబ్ మెరైన్ ‘ఐఎన్ఎస్ అరిఘాత్’ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించారు. అరిఘాత్ విశాఖపట్నం షిప్ బిల్డింగ్ సెంటర్ లో నిర్మితమవుతోంది. న్యూక్లియర్ వార్ హెడ్ లతో కూడిన బాలిస్టిక్ క్షిపణులను శత్రుసేనలపై ప్రయోగించే కెపాసిటీని కలిగి ఉన్న సబ్ మెరైన్ ఇది. మరో రెండు నెలలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. దీని బరువు ఆరువేల టన్నులు. ఇది పూర్తి అణ్వస్త్ర సామర్థ్యం కలిగి ఉన్న సబ్ మెరైన్. ఒకేసారి శత్రులపై 12 రకాల బాలిస్టిక్ మిస్సైల్స్ ను వదిలే కెపాసిటీ దీనికి ఉంది. సుదూర ప్రాంతాలలో ఉన్న లక్ష్యాలను కూడా ఇది ఛేదిస్తుంది. దాదాపు మూడు వేల ఐదు వందల కిలీమీటర్ల దూరంలో ఉన్న శత్రువులకు సంబంధించిన స్థావరాలను సైతం మట్టుబెట్టే సామర్థ్యం కలిగి ఉంది.


సబ్ మెరైన్లు పెంచుకునే దిశగా..

ఒక్కోసారి సముద్ర జలాలలోనే నిఘా వ్యూహాలు రూపొందించాల్సి ఉంటుంది. కొన్ని నెలల పాటు నీటిలోనే ఉండాల్సి ఉంటుంది. వీటి ఇంధనం కోసం నీటి పైకి రావలసిన అవసరం లేదు. వాటిలోనే రూపొందించిన రియాక్టర్లు కావలసినంత ఇంధనం సరఫరా చేస్తాయి. దీనితో నెలల తరబడి సముద్రం అడుగులోనే ఈ సబ్ మెరైన్ లలో ఉండవచ్చు. ప్రపంచంలోనే అత్యధిక సబ్ మెరైన్లను కలిగివున్న దేశంగా అమెరికా నేవీ వ్యవస్థ ఉంది. అమెరికా తర్వాత చైనా 10 సబ్ మెరైన్లు కలిగి ఉన్న దేశంగా చెప్పబడుతోంది. ప్రస్తుతం భారత నావికా దళ వ్యవస్థను మరింత పటిష్టవంతంగా చేసేందుకు భారత్ ఈ సబ్ మెరైన్ల సంఖ్య పెంచుకోవాలని చూస్తోంది. ఈ సంవత్సరం చివరలో అరిఘాత్ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీని తర్వాత ఇలాంటివే మరో రెండు కూడా అందుబాటులోకి రానున్నాయి.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×