BigTV English

Mahesh Babu – Rajamouli: ‘SSMB 29’ మూవీలో మలయాళ స్టార్ హీరో.. ఇది మామూలు హైప్ కాదు బాబోయ్..!

Mahesh Babu – Rajamouli: ‘SSMB 29’ మూవీలో మలయాళ స్టార్ హీరో.. ఇది మామూలు హైప్ కాదు బాబోయ్..!

SSMB 29: ప్రస్తుతం అందరిలోనూ రాజమౌళి – మహేశ్ బాబు కాంబో సినిమాపైనే ఉత్కంఠ. ‘SSMB29’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు సినీ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళి.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.


అంతేకాకుండా ఇటు టాలీవుడ్ సూపర్ స్టార్‌కు మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో వీరి కాంబోపై అంచనాలు రెట్టింపు చేసే బజ్ అయితే ఏర్పడింది. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ మూవీలోని హీరోయిన్ సహా ఇతర నటులకు సంబంధించిన వార్తలు జోరుగా సాగాయి. ఇప్పుడు మరొక వార్త వైరల్ అవుతోంది.

‘సలార్’లో ప్రభాస్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో నటించి అదరగొట్టిన మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.. ఇప్పుడు మహేశ్ – రాజమౌళి కాంబో మూవీలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. పృథ్వీరాజ్‌ సలార్ మూవీకి ముందు కూడా తెలుగులో చాలా సినిమాలు చేశాడు. కానీ సలార్ మూవీతోనే అతడికి మంచి గుర్తింపు వచ్చింది.


Also Read:  SSMB 29 కోసం జ‌క్క‌న సూప‌ర్ స్కెచ్‌

అందువల్లనే పృథ్వీరాజ్ ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టడం మొదలు పెట్టాడు. ఇక సలార్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా పృథ్వీరాజ్‌కు మంచి ఫేమ్ అందించింది. దీంతో ఇప్పుడు రాజమౌళి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతడిని ఈ మూవీలో భాగం చేయడం వల్ల మాలీవుడ్‌లో కూడా ఈ మూవీకి మంచి హైప్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారట.

దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తుండటంతో అందరిలోనూ అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అంతేకాకుండా ఇతర ఇండస్ట్రీ స్టార్లను ఇందులో భాగం చేయడం వల్ల కూడా ఈ మూవీపై మరింత బజ్ ఏర్పడుతుందని భావిస్తున్నారట. అందువల్లనే ఈ మూవీకోసం హాలీవుడ్ నుంచి కూడా స్టార్లను రంగంలోకి దించే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్.

ఇకపోతే ఈ మూవీ కోసం మహేశ్ బాబు చాలా మారుతున్నాడు. లుక్ విషయంలో కానీ, బాడీ ఫిట్‌నెస్ విషయంలో కానీ బాగా కసరత్తులు చేస్తున్నాడు. గడ్డం, ఫుల్ హెయిర్‌‌తో ఇటీవల కనిపించిన లుక్ చూసి ప్రేక్షకాభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. ఏదీ ఏమైనా ఈ మూవీ కోసం దర్శకుడు భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడనే చెప్పాలి.

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×