BigTV English

RCB vs CSK Match Preview : ఆర్సీబీ వర్సెస్ చెన్నై.. ఉండేదెవరు ? వెళ్లేదెవరు ?

RCB vs CSK Match Preview : ఆర్సీబీ వర్సెస్ చెన్నై.. ఉండేదెవరు ? వెళ్లేదెవరు ?

RCB vs CSK IPL 2024 68th Match Preview : ఐపీఎల్ సీజన్ 2024లో ఇంతవరకు 67 మ్యాచ్ లు జరిగాయి. ఏ మ్యాచ్ కూడా ఇంత టెన్షన్ క్రియేట్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే నేడు ఆర్సీబీ వర్సెస్ చెన్నై మధ్య జరిగే మ్యాచ్ హై ఓల్టేజ్ ని క్రియేట్ చేయనుంది. నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. అప్పుడే అందరిలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.


ఎందుకంటే ఇది కూడా ఒక నాకౌట్ మ్యాచ్ లాంటిదే. గెలిచిన వాళ్లు ప్లే ఆఫ్ కి వెళతారు. కానీ ఆర్సీబీ మాత్రం ప్లే ఆఫ్ కి చేరాలంటే.. 18 పరుగుల తేడాతో గెలవాలి. లేదా 18.1 ఓవర్ లో టార్గెట్ పూర్తి చేయాలి. ఇక్కడ టాస్ కూడా కీలకంగా మారనుందని అంటున్నారు. ఎటుచూసినా చెన్నయ్ వైపు అదృష్టం పాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వరుసపెట్టి 5 మ్యాచ్ లను గెలుస్తూ వస్తున్న ఆర్సీబీ అదే ఊపుతో గెలిచి, ప్లే ఆఫ్ కి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.

Also Read : టీ 20 ప్రపంచకప్ షురూ.. ఇండియా వార్మప్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా..?


ఐపీఎల్ 2024 సీజన్ లో ఇంతవరకు రెండు జట్లు 13 మ్యాచ్ లు ఆడాయి. చెన్నయ్ 14 పాయింట్లతో ఉంది. ఆర్సీబీ 12 పాయింట్లతో ఉంది. ఇప్పుడు ఆర్సీబీ ఖచ్చితంగా మెరుగైన రన్ రేట్ తో గెలవాలి. ఇంతవరకు రెండు జట్ల మధ్య 33 మ్యాచ్ లు జరిగాయి. చెన్నయ్ 22 విజయం సాధిస్తే, ఆర్సీబీ 10 మాత్రమే గెలిచింది. 1 మ్యాచ్ లో ఫలితం రాలేదు.

ఈ లెక్కన చూస్తే చెన్నయ్ కే రికార్డ్ బాగుంది. కాకపోతే ఆర్సీబీ మాత్రం మంచి దూకుడు మీద ఉంది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో ఆర్సీబీ తెగించి ఆడుతుందని అంటున్నారు. ఇంక విరాట్ విశ్వరూపం చూడవచ్చునని కూడా అభిమానులు చెబుతున్నారు. అలాగే చెన్నయ్ నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తన కెప్టెన్సీ బుర్రకి పదును పెడతాడని అంటున్నారు. కూల్ గా మ్యాచ్ ని కొట్టేస్తాడని చెబుతున్నారు. మరేం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే.

Tags

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×