BigTV English
Advertisement

Film industry: సరికొత్త రికార్డు.. 555సార్లు రీరిలీజ్.. 30ఏళ్ల నాటి మూవీ విశేషాలు..!

Film industry: సరికొత్త రికార్డు.. 555సార్లు రీరిలీజ్.. 30ఏళ్ల నాటి మూవీ విశేషాలు..!

Film industry..ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తమ అభిమాన హీరోల కొత్త మూవీల అప్డేట్స్ లేకపోవడం వల్లే అభిమానులు ఇలా వారి కెరియర్లో సూపర్ హిట్గా నిలిచిన చిత్రాలను మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేసి సంబరపడుతున్నారు.. అయితే ఈ రీ రిలీజ్ సినిమాలు అంటే ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే రీ రిలీజ్ అవుతాయి. కానీ ఇక్కడ ఒక కన్నడ చిత్రం మాత్రం ఏకంగా 555 సార్లు రిలీజ్ అయ్యి.. ఇప్పుడు 556వ సారి రీ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. మరి ఆ సినిమా ఏంటి.? ఆ సినిమా నటీనటులు ఎవరు ఆ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ ఎవరు? అసలు ఆ మూవీ విశేషాలు ఏంటి? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.


రీ రిలీజ్ లో సరికొత్త రికార్డు..

ఆ సినిమా ఏదో కాదు ప్రముఖ కన్నడ స్టార్ హీరో కం డైరెక్టర్ ఉపేంద్ర (Upendra) దర్శకత్వంలో తెరకెక్కిన ఓం (OM). కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Raj Kumar), ప్రేమ(Prema ) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 1995 మే 19న విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అంతేకాదు కన్నడ ఫిలిం ఇండస్ట్రీలోనే కల్ట్ క్లాసిక్ మూవీ గా నిలిచిపోయింది. ఇక ఈ సినిమాకి భాషతో సంబంధం లేకుండా అభిమానులు ఏర్పడ్డారు. అందుకే ప్రతి 2 లేదా 3 వారాలకు ఒకసారి ఈ సినిమాను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తుంటారు మేకర్స్. అలా ఇప్పటివరకు ఏకంగా 555 సార్లు రీ రిలీజ్ చేయగా.. ఇప్పటికే 70 సార్లు 100 రోజులు ఈ సినిమా పూర్తి చేసుకుని రికార్డు సృష్టించింది. అటు కన్నడ పరిశ్రమలోనే కాకుండా భారతీయ సినీ చరిత్రలోనే అరుదైన రికార్డు సాధించి, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. అంతేకాదు బెంగళూరులోని కపాలి థియేటర్లో ఏకంగా 30 సార్లు విడుదలైన చిత్రంగా మరో రికార్డు ఈ సినిమా పేరిట నమోదు కావడం గమనార్హం.


Also read: Anil Ravipudi : గురువుకే చుక్కలు చూపిస్తున్న బుల్లిరాజు… పాపం అనిల్… చివరికి అడుక్కునే పరిస్థితి..!

556వ సారి రీ రిలీజ్ కి సిద్ధం..

ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ఓం సినిమా మళ్లీ 556వ సారి రీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. మే 19వ నాటికి 30 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో మరొకసారి థియేటర్లలోకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈసారి ప్రత్యేకత ఏమిటంటే.. తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి తీసుకురావడం కోసం ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో కూడా డబ్ చేసి రెండు తెలుగు రాష్ట్రాలలో రీ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఇన్నిసార్లు రీ రిలీజ్ అయ్యి.. ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న ఈ సినిమా ఇప్పుడు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఏది ఏమైనా ఇంతటి ఘన చరిత్ర సాధించిన ఈ సినిమా పై ఇండస్ట్రీ నుండీ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరి దీనిపై ఉపేంద్ర, శివరాజ్ కుమార్ ఎలాంటి కామెంట్స్ చేస్తారో చూడాలి.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×