Malaika Arora :బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా మోడల్ గా, తన జీవితాన్ని మొదలుపెట్టి, యాంకర్ గా, హీరోయిన్ గా బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంటూ సల్మాన్ ఖాన్ తో వరుస సినిమాలు చేసి, దబాంగ్ సిరీస్ ను రూపొందించి ,సూపర్ సక్సెస్ ని అందుకుంది. సినిమాలపరంగా కెరియర్ లో కొంత గ్యాప్ వచ్చినా, సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ, టచ్ లోనే ఉంది. ఇప్పుడు ఈమె గురించి బాలీవుడ్ లో ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం.
బాలీవుడ్ నటి కి నోటీసులు …
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, కరీనా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2012లో మలైకా తో కలిసి వీరు ఓ రెస్టారెంట్ కి వెళ్ళగా, అక్కడ జరిగిన దాడి కేసులో ఇప్పుడు మలైకా పై అరెస్టు వారింటి జారీ అయింది. 2012లో జరిగిన ఈ ఘటనకు మలైకాకు రెండోసారి బేలబుల్ వారెంట్ జారీ అయ్యింది. అప్పట్లో ఈ వార్తా సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఖాన్, కరీనాతో పాటు మలైకా కూడా ,హోటల్ కి వెళ్లారు. అక్కడ ఒక కస్టమర్ తో గొడవకు దిగారు. అతనిపై ఆయన దాడి చేశారు. కాగా ఈ కేసు విచారణలో సాక్షిగా ఉన్న మలైకా కోర్టుకు, హాజరుకావాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. ఖాన్ గొడవ పడే సమయం లో మలైకా, కరీనా ఇద్దరు అక్కడే ఉన్నారు.
ఖాన్ కు నోటీసులు ..
పోలీసులు కథనం ప్రకారం సైఫ్ అలీ ఖాన్, రెస్టారెంట్ కి వచ్చిన ఒక వ్యక్తి ఆడవారితో తప్పుగా ప్రవర్తిస్తుంటే అతన్ని అడ్డుకునే క్రమంలో గొడవ జరిగిందని, ఇద్దరి మధ్య గొడవ పెద్దదవడంతో సైఫ్ అలీఖాన్ తో పాటు అతని స్నేహితుడు షకీల్, బిలాల్, ను కూడా అరెస్ట్ చేశారు. తరువాత బెయిల్ పై విడుదలయ్యారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న మలైకా కోర్టుకు రావాలని క్రితం లో ఒకసారి నోటీసులు జారీ అయ్యాయి. అప్పుడు ఆమె హాజరు కాకపోవడంతో రెండోసారి బెయిలబుల్ వారంట్ జారీ అయింది. ఈ కేసులో సైఫ్ అలీ ఖాన్ కి కూడా సోమవారం కోర్టుకు హాజరుకావాలని నోటీసులు పంపినట్టు సమాచారం . ఇప్పటివరకు కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు కోరుతూ వచ్చారు. మలైకా అరోరా కోర్టు ముందు హాజరు కావాల్సి ఉన్న ఆమెపై బెయిల్ వారింటి జారీ చేసింది. ఆమె రూ.5000 పూచీ బెయిల్ ని ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ రెండోసారి నోటీసులు అందడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.