Mamita Baiju: ఈ మధ్య హీరోయిన్లు సినిమాలు చేస్తూనే ప్రేమలో పడ్డామని సడెన్ షాకిస్తున్నారు. కొందరు ఏకంగా పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత త్వరలో నా పెళ్లి అని హింట్ ఇస్తున్నారు. గత ఏడాది వివాహ బంధంలోకి అడుగు పెట్టిన కీర్తి సురేష్ ( Keerthi Suresh ) అలాగే చెప్పి బాంబ్ పేల్చింది. ఇక యంగ్ హీరోయిన్లు ఎప్పుడు లవ్ లో పడతారా? అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. సినిమాల్లోకి రాకముందే పలువురు ముద్దుగుమ్మలు రిలేషన్‌లో ఉంటున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కొందరు ప్రేమలో పడుతున్నారు. సడెన్‌గా తమ రిలేషన్‌ను బయటి పెట్టి అభిమానులకు షాకిస్తున్నారు. తాజాగా మరో మలయాళ బ్యూటి తాను లవ్ లో ఉన్నట్లు ఒక్క పోస్ట్ తో హింట్ ఇచ్చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో? ఇప్పుడు తెలుసుకుందాం…
మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలు ఈ మధ్య బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజ్ అయిన మూవీలలో ప్రేమలు ఒకటి. ఒక చిన్న ప్రేమ కథగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది. కోట్లు రాబట్టి సూపర్ హిట్ అయ్యింది. ఆ చిత్రంలో హీరోయిన్ గా మమిత బైజు ( Mamitha Baiju ) నటించింది. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అవ్వడమే కాదు.. ఆమె క్యూట్ అందాలతో కుర్రాళ్ళను ఆకట్టుకుంది. ప్రేమలు సినిమా తర్వాత ఆమె పాత వీడియోలు, రీల్స్, డ్యాన్స్ క్లిప్పులు ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. మమిత డ్రెస్సింగ్ స్టైల్ , హెయిర్ స్టైల్‌కు ఫిదా అయిన అమ్మాయిలు ఆమెను ఫాలో అవుతున్నారు అంటే అతి శయోక్తి కాదు.. అంతగా క్రేజ్ ను అందుకుంది.
Also Read : త్రివిక్రమ్ మూవీకి అల్లు అర్జున్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతంటే..?
ఇదిలా ఉండగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ అమ్మడు ప్రేమలో పడిందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది విన్న ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయ్యిందనే చెప్పాలి. మరికొందరు ఆమెను లవ్ లో పడేసిన వ్యక్తి ఎవరు అని ఆరా తీస్తున్నారు.. ఇంతకీ ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు. ప్రేమలో మూవీలో హీరోకు ఫ్రెండ్ గా నటించిన వ్యక్తే.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మమితా బైజు తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో ఓ కుర్రాడితో క్లోజ్‌గా ఉన్న మమితా అతనితో టీ తాగుతూ.. ఐస్ క్రీమ్ తింటూ, బస్సులో వెళ్తూ కనిపించింది. నా ప్రాణ స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. నువ్వు నాకు అత్యుత్తమ స్నేహితుడివి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా జీవితంలోకి అనుకోకుండా సరైన సమయంలో వచ్చిన అరుదైన రత్నానివి అంటూ లవ్ ఎమోజీని షేర్ చేసింది. ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో ప్రేమలు పడిందని ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తుందా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తమిళ్, మాలయళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.