Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) రీసెంట్ గా పుష్ప 2 (Pushpa 2) మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు. గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఈ మూవీ క్రేజ్ రెండు నెలలు అవుతున్నా కూడా తగ్గలేదు. దాదాపు 1800 కోట్లు వసూల్ చేసిందని మేకర్స్ ప్రకటించారు. అటు ఈ మధ్య ఓటీటి లోకి అడుగు పెట్టి దుమ్ము దులిపేస్తుంది. నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వసూళ్లను సాధించిన మూవీగా రికార్డులను సొంతం చేసుకుంది. ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ ప్రస్తుతం ఏ డైరెక్టర్ తో సినిమాను చేస్తాడా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ త్రివిక్రమ్ ( Trivikram) తో సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. అయితే పుష్ప 2 కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్న అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో అని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలైయ్యాయి. అయితే తాజాగా ఈ మూవీకి అల్లు అర్జున్ తీసుకుంటున్న పారితోషికం పై సోషల్ మీడియాలో మరో వార్త చక్కర్లు కొడుతుంది..
అల్లు అర్జున్ గతంలో నటించిన పుష్ప మూవీతో నేషనల్ వైడ్ మంచి టాక్ ను సొంతం చేసుకున్నాడు.. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్ గా పుష్ప 2 మూవీ వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. అయితే ఈ మూవీని 450 కోట్లతో నిర్మిస్తే అందులో 300 కోట్ల వరకు హీరో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.. అయితే ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు 700 కోట్ల వరకు అవుతుందని తెలుస్తోంది. మరి త్రివిక్రమ్ ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తాడు. భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అని ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.. గతంలో వీరిద్దరి కాంబోలో గతంలో అలా వైకుంఠపురంలో మూవీ వచ్చింది. హిట్ సినిమాలు లేని అల్లు అర్జున్ కు కమ్ బ్యాక్ ఇచ్చింది. దాంతో ఇప్పుడు రాబోతున్న సినిమా పై ఇప్పటి నుంచే అంచనాలు ఎక్కువగా క్రియేట్ అవుతున్నాయి.
Also Read : వర్మ కంట్లో పడితే అంతే.. శారీ హీరోయిన్ ను అంత టార్చర్ చేశాడా..?
పాన్ ఇండియాలో తనన మించిన దర్శకుడు లేడు అనే రేంజ్ లో త్రివిక్రమ్ ఈ సినిమాని చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. నిజంగానే త్రివిక్రమ్ ఆ రేంజ్ లో సినిమాను చేయగలడా ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ కే పరిచయమైన డైరెక్టర్ ఇప్పుడు మొదటిసారి పాన్ ఇండియా మూవీని చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని అందుకోవాలని ఆయన అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారట. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మొత్తానికి ఈ కాంభో మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ ఎలా పెర్ఫార్మన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి. ఇక ఈ మూవీ తర్వాత సుకుమార్ తో పుష్ప 3 చెయ్యనున్నాడు