BigTV English

Meta’s Undersea Cable Project : ఏఐ కోసం సముద్రంలో ఇంటర్నెట్ కేబుళ్లు.. మోటా భారీ ప్రాజెక్టులోకి ఇండియా

Meta’s Undersea Cable Project : ఏఐ కోసం సముద్రంలో ఇంటర్నెట్ కేబుళ్లు.. మోటా భారీ ప్రాజెక్టులోకి ఇండియా

Meta’s Undersea Cable Project : అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య వేగవంతమైన ఇంటర్నెట్ సేవల కోసం సముద్ర గర్భంలో వందల కిలోమీటర్ల మేర కేబుళ్లు ఉంటాయి. ఈ కేబుళ్ల ద్వారానే అత్యంత వేగంగా సమాచారం దేశాల మధ్య మారుతూ ఉంటుంది. టెక్ దిగ్గజ సంస్థ, ఫేస్బుక్ మాతృసంస్థ అయిన మెటా.. ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ సీ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. సంస్థ లక్ష్యాల మేరకు అత్యంత వేగమైన ఇంటర్నెట్, ఇతర సాంకేతిక సేవల కోసం వినియోగిస్తున్న ‘ప్రాజెక్ట్‌ వాటర్‌వర్త్‌’ లో భారత్ ను అనుసంధానిస్తున్నట్లు మెటా ప్రకటించింది.


కోట్ల డాలర్ల విలువైన ఈ పాజెక్టు ద్వారా మెటా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ లో మరో భారీ పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టు. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వేగవంతమైన, నమ్మదగిన ఇంటర్నెట్‌ను అందించేందుకు మెటా ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా.. ఇంటర్నెట్ సేవలకు దూరంగా ఉన్న ప్రాంతాలను ఈ ప్రాజెక్టు ద్వారా కలపాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. తన సేవలైన ఫేస్బుట్, ఇన్ స్టాగ్రామ్ లతో పాటు అత్యధిక ఇంటర్నెట్ వినియోగం ఉన్న.. ఇండియానూ ఈ ప్రాజెక్టుకు అనుసంధానిస్తున్నట్లు మెటా ప్రకటించింది.

సముద్రం లోతుల్లో బలమైన, ఆధునాతమైన కేబుళ్లను పరచనున్నారు. వీటిని అమెరికా, భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా సహా అనేక ఇతర ప్రాంతాలను కలపుతూ.. దాదాపు 50,000 కి.మీ మేర సముద్ర గర్భంలో ఈ కేబుళ్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రాజెక్ట్ వాటర్‌వర్త్‌గా పిలువబడే ఈ అండర్ సీ కేబుల్ ప్రాజెక్టు ద్వారా.. ప్రపంచవ్యాప్తంగా AI ఆవిష్కరణలకు, ఆయా సేవల్ని అందుకునేందుకు కావాల్సిన ఇంటర్నెటన్ సౌకర్యాన్ని అందించడం ప్రధాన లక్ష్యం. ఏఐ కోసం హై-స్పీడ్ కనెక్టివిటీతో ఈ కొత్త అండర్ సీ కారిడార్‌లను మెటా అనుసంధానించనుంది.


ఈ కేబుళ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే.. ఆయా దేశాలకు విశ్వసనీయమైన, హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు కోసం బిలియన్ డాలర్ల ఖర్చు చేయనున్నట్లు ప్రకటించిన మెటా.. ఈ దశాబ్దం చివరి నాటికి సేవల్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. “మెటా భారత్ లో పెట్టుబడి పెడుతోంది. సంస్థకు అతిపెద్ద మార్కెట్లలలో ఒకటైన భారత్, యుఎస్ సహా ఇతర దేశాలను అనుసంధానించేందుకు ప్రపంచంలోనే అతి పొడవైన, అత్యధిక సామర్థ్యం, సాంకేతికంగా అత్యంత అధునాతనమైన సబ్‌సీ కేబుల్ ప్రాజెక్ట్‌ను తీసుకువస్తోంది” అంటూ తన బ్లాగ్ లో రాసుకొచ్చింది.

ఇలాంటి కేబుళ్లు ప్రకృతి విపత్తుల సమయంలో దెబ్బతింటుంటాయి. భూకంపాలు, సునామీలతో పాటు సముద్రంలోని అగ్నిపర్వతాలు పేలిన సందర్భాల్లో కేబుళ్లకు డ్యామేజ్ అవుతుంటుంది. అలాంటి సమస్యలు రాకుండా.. ఈ కేబుళ్లను 7,000 మీటర్ల లోతులో వేయనున్నారు. లోతు తక్కువగా ఉండే ప్రాంతాలు, ఓడలు యాంకర్లు వేసే ప్రాంతాల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నట్లు మెటా తెలిపింది. ఇటీవలే ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అక్కడి కీలక సీఈఓ లతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఇండో-అమెరికా సంయుక్త ప్రకటనలో మెటా చేపట్టనున్న ప్రాజెక్టు గురించిన ప్రస్తావన ఉంది. ఈ ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభించారని చూస్తున్నారు. కాగా.. అండర్ సీ కేబుల్ ప్రాజెక్ట్ విషయమై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. నమ్మకమైన విక్రేతలతో హిందూ మహాసముద్రంలో సముద్రగర్భ కేబుల్‌ల నిర్వహణ, మరమ్మత్తు, ఫైనాన్సింగ్‌లో పెట్టుబడి పెట్టాలని భారత్ భావిస్తోందంటూ.. ఓ ప్రకటనలో భారత్ వెల్లడించింది.

Also Read : ఇండియాలో ఏఐ సూపర్ సక్సెస్ – టాప్ సంస్థల పెట్టుబడులు

మెటా ప్రారంభించనున్న అండర్ సీ కేబుల్ ప్రాజెక్టుతో కలుపుకుని భారత్ లో 18వ ల్యాండింగ్ స్టేషన్ అవుతుంది. అంటే.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా ప్రకారం.. ఇప్పటి వరకు దేశం 17 డిస్ట్రిక్ట్ ల్యాండింగ్ స్టేషన్లల్లో.. 17 ఇంటర్నేషనల్ సబ్ సీ కేబుల్‌ వ్యవస్థలు కలిసి ఉన్నాయి. ఈ కేబుల్స్ మొత్తం లిట్ సామర్థ్యం, యాక్టివ్ సామర్థ్యం 180 టెరాబిట్ పర్ సెకను (TBPS), 132 TBPSగా ఉన్నాయని ట్రాయ్ వెల్లడించింది.

Tags

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×