BigTV English

Jaya Bachchan: నా మనవరాలు పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కన్నా ఓకే.. జయ బచ్చన్ షాకింగ్ స్టేట్‌మెంట్

Jaya Bachchan: నా మనవరాలు పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కన్నా ఓకే.. జయ బచ్చన్ షాకింగ్ స్టేట్‌మెంట్

Jaya Bachchan: ఈరోజుల్లో పెళ్లి మీద చాలామందికి ఇంట్రెస్ట్ లేదు. ఆ ఇంట్రెస్ట్ లేనివారిలో సినీ సెలబ్రిటీలు ముందుంటారు. అందుకే ఎంతోకాలం రిలేషన్‌షిప్‌లో ఉన్నా, ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా సినీ పరిశ్రమలో విడాకుల సంఖ్య పెరిగిపోతోంది. కొందరు ఇలా ఉంటే.. మరికొందరి ఆలోచన ఇంకొకలాగా ఉంది. పిల్లలు కావాలనుకుంటే పెళ్లే అవసరం లేదు కదా అన్నట్టుగా చాలామంది యంగ్ హీరోయిన్స్ ఇప్పటికే తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ తాజాగా అమితాబ్ బచ్చన్ భార్య జయ బచ్చన్ కూడా తాజాగా అలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వడం షాకింగ్‌గా అనిపిస్తోంది. తన మనవరాలు కూడా అలాంటి పని చేస్తే తనకేం ప్రాబ్లమ్ లేదని తెలిపింది.


అంగీకరించకపోయినా ఓకే

అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ మనవరాలు అయిన నవ్య నవేలి నందా అందరి స్టార్ కిడ్స్ లాగా వెంటనే హీరోయిన్ అవ్వాలని అనుకోకుండా ముందుగా పోడ్కాస్ట్స్‌తో ప్రేక్షకులకు దగ్గరవ్వాలని చూసింది. అందుకే ‘వాట్ ది హెల్ నవ్య’ అనే పోడ్కాస్ట్‌ను ప్రారంభించి సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తుంది. ఈ పోడ్కాస్ట్‌ను మొదట్లో తన అమ్మమ్మ జయ బచ్చన్‌తోనే ప్రారంభించింది. అప్పట్లో జయ బచ్చన్ చేసిన కామెంట్స్ తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ‘‘నేను ఇలా మాట్లాడుతున్నానని ప్రేక్షకులను అంగీకరించకపోవచ్చు. కానీ శారీరికంగా అట్రాక్షన్ అనేది చాలా ముఖ్యం’’ అని చెప్పుకొచ్చింది జయ బచ్చన్.


ఫిజికల్ రిలేషన్‌షిప్

‘‘మా జెనరేషన్‌లో మేము ఎలాంటి ప్రయోగాలు చేసే అవకాశం లేదు. కానీ ఈ జెనరేషన్‌కు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫిజికల్ రిలేషన్‌షిప్ అనేది రిలేషన్‌షిప్ ఎక్కువకాలం నిలబడేలా చేస్తుంది. అలాంటిది లేకపోతే రిలేషన్‌షిప్ కూడా ఉండదు. మీరు రిలేషన్‌షిప్‌ను కేవలం ప్రేమ, గాలి, సర్దుబాట్లుపై ఎక్కువకాలం నడిపించలేరు. అందుకే అది కూడా చాలా చాలా ముఖ్యం. ఈ యంగ్ జెనరేషన్‌లో చాలామంది.. ఆఖరికి నా కూతురు శ్వేతతో సహా చాలామంది విషయంలో వేర్వేరు ఆలోచనా విధానాలు ఉంటాయి. దానికే వారు గిల్టీగా ఫీలవుతుంటారు. అలాంటివి రిలేషన్‌షిప్‌లో తప్పుగా చూడకూడదు’’ అంటూ జయ బచ్చన్ (Jaya Bachchan) చేసిన వ్యాఖ్యలు అప్పుడు మాత్రమే కాదు.. ఇప్పటికీ కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి.

Also Read: గుడ్ న్యూస్ చెప్పిన మెగా డాటర్.. మైలురాయి అంటూ పోస్ట్..!

రొమాన్స్ ముఖ్యం

‘‘నేను ఈ విషయాన్ని మెడికల్ పరంగా చూస్తున్నాను. ఈరోజుల్లో రొమాన్స్ అనేది అసలు ఉండడం లేదు. అందుకే మీరు మీ బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవడం మంచిది. మీరు వారితో అన్నీ డిస్కస్ చేయగలగాలి. నువ్వు నాకు ఇష్టం కాబట్టే నీకు పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పగలగాలి. నా మనవరాలు నవ్య కూడా పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కంటే నాకేం ప్రాబ్లమ్ లేదు’’ అని చెప్పి షాకిచ్చింది జయ బచ్చన్. రిలేషన్‌షిప్స్ అనేవి ఎమోషన్ మీద ఆధారపడి ఉంటాయని చాలామంది అప్పటి జెనరేషన్ నటీనటులు అంటుంటే జయ బచ్చన్ మాత్రం వారందరికీ భిన్నంగా ఎమోషన్‌తో పాటు ఫిజికల్ రిలేషన్‌షిప్ కూడా ముఖ్యమే అని తెలిపింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×