BigTV English

Mammootty’s Bramayugam OTT: మమ్ముట్టి ‘భ్రమయుగం’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. ఎప్పుడు వస్తుందంటే?

Mammootty’s Bramayugam OTT: మమ్ముట్టి ‘భ్రమయుగం’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. ఎప్పుడు వస్తుందంటే?

Mammootty’s Bramayugam OTT Release Date in Telugu: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి విభిన్నమైన పాత్రలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. పాత్ర ఏదైనా.. అందులో ఒదిగిపోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అయితే తాజాగా ఆయన మరొక డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘భ్రమయుగం’.


రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ కీలక పాత్రలు పోషించారు. ఇక మలయాళం, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో రూపొందిన ఈ సినిమా డబ్బింగ్ పనులు పూర్తికాకపోవడంతో మలయాళంలో విడుదలైంది.

త్వరలోనే ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మలయాళంలో రిలీజైన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ అందుకొని అందరినీ ఆకట్టుకుంది.


Read More: భ్ర‌మ‌యుగం ట్విట్ట‌ర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

ఈ మూవీలో మమ్ముట్టి తన నటనతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆయన వైవిధ్యమైన నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా దర్శకుని క్రియేటివిటీ పట్ల కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇకపోతే ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన సందర్భంగా.. ఇప్పుడు ఓటీటీ డీల్‌కు సంబంధించిన ఓ వార్త బయటకొచ్చింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను సోనీలివ్ దక్కించుకుంది. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రన్ తర్వాత ఈ మూవీ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనిని ఏప్రిల్‌లో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ నిర్మించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో సుమారు రూ.13 కోట్ల వరకు గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగు వెర్షన్‌ ఫిబ్రవరి 23న థియేటర్లలోకి వస్తుందని అంతా అనుకుంటున్నారు.

Read More: మీ ఫోన్లలోకి ‘హనుమాన్’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

మరికొందరెమో ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చే అవకాశముందని గుస గుసలాడుకుంటున్నారు. చూడాలి మరి ఈ మూవీ తెలుగు వెర్షన్‌ని ఎక్కడ ప్రదర్శిస్తారో.

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×