NagarKurnool Murder| వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ యువకుడిని అతని భార్య, ప్రియుడు హత్య చేశారు. అయితే పోలీసులు వారి కుట్రను బట్టబయలు చేసి పట్టుకున్నారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పాన్‌గల్‌కు చెందిన ఎండీ పర్వీన్‌బేగం అనే యువతకి 12 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన ఎండీ రహమతుల్లాతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు సంతానం. వివాహమైన రెండేళ్లపాటు కర్నూలులోనే ఉండగా.. సంసారం విషయంలో పర్వీన్ బేగంలకు అత్తగారింట్లో గొడవలు వచ్చాయి. దీంతో పదేళ్ల క్రితమే పిల్లలను తీసుకొని పర్వీన్ బేగం తల్లిగారి గ్రామమైన పాన్‌గల్ లో కాపురం పెట్టారు. పాన్ గల్ లోని సంతబజార్‌లో ఒక అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. రహమతుల్లా మటన్ కట్టింగ్, పెయింటింగ్ పనిచేస్తుండగా.. అతని భార్య పర్వీన్ బేగం టైలర్ పనిచేస్తుంది.
ఈ క్రమంలో టైలరింగ్ షాపు పక్కనే కిరాణం షాపు నడుపుతున్న కుమ్మరి రాఘవేందర్ తో పర్వీన్ బేగంకు పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. రాఘవేందర్, రహమతుల్లా ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. అయితే రాఘవేందర్, పర్వీన్ బేగంల గురించి ఇతరులు రహమతుల్లాకు తెలియజేశారు. దీంతో ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. పెద్దలు మందలించడంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది. కానీ ఆ తర్వాత తరుచుగా భార్య భర్తల మధ్య గొడవలు జరిగేవి. దీంతో అసహనానికి గురైన పర్వీన్ బేగం తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రహమతుల్లాను హత్య చేయడానికి తన ప్రియుడితో కలిసి కుట్ర చేసింది.
Also Read: పెళ్లి సంబంధాల పేరుతో మోసాలు.. వీడియోలు అడ్డం పెట్టి, ఆపై
ఈ క్రమంలోనే రాఘవేంద్ర తనకు పరిచయం ఉన్న కురుమూర్తితో కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 1న తెల్లవారుజామున 4 గంటల సమయంలో కురుమూర్తిని రహమతుల్లా ఇంటికి పంపించి గొర్రెను కోసేది ఉంది అని చెప్పి వెంట తీసుకొని పాన్‌గల్ గ్రామ శివారులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని కేఎల్‌ఐ కాల్వ దగ్గరకు వెళ్లగా అప్పటికే రాఘవేంద్ర తన బైక్‌పై అక్కడికి వచ్చి హతమార్చారు.
రహమతుల్లా తల మీద కురుమూర్తి గట్టిగా కొట్టాడు. ఆ తరువాత అతని కాళ్లు గట్టిగా పట్టుకోగా.. రహమతుల్లా చాతీపై రాఘవేంద్ర కూర్చొని అతని గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. రహమతుల్లా చనిపోయాడని ధృవీకరించుకొని అతని మృతదేహంతో పాటు అతను గొర్రెను వధించడానికి వెంట తీసుకొచ్చిన కత్తిని పక్కనే ఉన్న కాలువలో పడేశారు. ఆ తరువాత అక్కడి నుంచి ఏమీ జరగనట్లు రాఘవేంద్ర, కురుమూర్తి వెళ్లిపోయారు.
మరోవైపు పర్వీన్ బేగం.. తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. కానీ పోలీసులకు కాలువలో రహమతుల్లా శవం లభించింది. ఆ ప్రాంతంలోని సిసిటీవిలు పరిశీలించగా.. రహమతుల్లా, రాఘవేంద్ర, కురుమూర్తి ముగ్గురూ ఒకే బైక్ పై ఆ ప్రాంతంలో వెళుతున్నట్ల కనిపించింది. దీంతో పోలీసులు రాఘవేంద్ర, కురుమూర్తిని అరెస్టు చేశారు. వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని విచారణ చేయగా.. నిజం బయటపడింది. పోలీసులు రహమతుల్లా హత్య కేసులో అతని భార్యను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
మటన్ కర్రీ వండలేదనే భార్యను హత్య చేసిన భర్త
మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. మటన్ కూర వండలేదని భార్యను ఒక భర్త చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీరోల్ మండల కేంద్రానికి చెందిన ఎం కళావతి, ఎం బాలు భార్యభర్తలు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో బాలుకి నాన్ వెజ్ తినాలని బుద్ధి పుట్టింది. ముందుగా చికెన్ కూర తిందామని అనుకున్నాడు. కానీ బర్డ్ ఫ్లూ అంటూ ప్రచారం జరుగుతుండడంతో భయపడి మటన్ తీసుకొచ్చాడు.
ఇంట్లో ఈ రోజు మటన్ కూర చేయమని భార్యను కోరాడు. అందుకు భార్య అంగీకరించలేదు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో నిందితుడు బాలుకి కోపం పట్టలేక.. భార్య కళావతిని వెనక్కి నెట్టాడు. భర్త నెట్టడంతో కళావతి తలకి బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఇది చూసి బాలు భయపడి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు.