Shree Rapaka.. ప్రముఖ బిగ్ బాస్ (Bigg Boss)బ్యూటీ శ్రీ రాపాక (Sree Rapaka) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) స్కూల్ నుండి వచ్చిన ఈమె.. అక్కడ బాగా పేరు సొంతం చేసుకుని బిగ్ బాస్ హౌస్ లో అవకాశం అందుకొని, అక్కడ తన స్ట్రాటజీ ఏంటో చూపించింది. ముఖ్యంగా అప్పట్లో ‘నగ్నం’ అంటూ స్వీటీగా ఇండస్ట్రీకి పరిచయమైంది శ్రీ రాపాక. లాక్ డౌన్ సమయంలోనే విడుదలైన ఈ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ సినిమాతోనే రాంగోపాల్ వర్మ ఈమెను హీరోయిన్ ని చేసారు. ఇకపోతే ఈ వెస్ట్ గోదావరి స్వీటీ ని చాలా గ్లామర్ గా మార్చి ‘నగ్నం ‘అనే చిత్రాన్ని రూపొందించి ఆన్లైన్లో రిలీజ్ చేశాడు. అంతేకాదు ఈ సినిమా కాసుల వర్షం కూడా కురిపించింది. ఇక ఇప్పుడు సినిమాలలో అవకాశాలు దక్కించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తాను కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో అవకాశం దక్కించుకున్నాను అంటూ చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచింది.
విజయ్ సేతుపతి మూవీలో ఛాన్స్ కొట్టేసిన శ్రీ రాపాక..
అసలు విషయంలోకెళితే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తో ఒక సినిమా అయినా చేయాలి అని ఎంతమంది అయితే కలలు కంటారో.. అలాగే తమిళంలో ‘మక్కల్ సెల్వన్’ గా బిరుదు అందుకున్న విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తో కూడా కలిసి పనిచేయాలని అంతే కోరుకుంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు విజయ్ సేతుపతితో కలిసి పనిచేసే అవకాశాన్ని అందుకుంది ఈ బిగ్ బాస్ బ్యూటీ. త్వరలో ఆయనతో కలిసి పనిచేస్తున్నట్టు విజయ్ సేతుపతితో కలిసి దిగిన ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇకపోతే శ్రీ రాపాక ఇండస్ట్రీలోకి నటిగా రాకముందు ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. మరి ఈమె విజయ్ సేతుపతితో కలిసి నటిస్తోందా? లేక విజయ్ సేతుపతి నెక్స్ట్ మూవీకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తోందా ? అనే వివరాలను మాత్రం పొందుపరచలేదు. మొత్తానికైతే ఆయనతో పనిచేస్తున్నాం అనే విషయాన్ని మాత్రమే తెలిపింది శ్రీ రాపాక. ఏది ఏమైనా ఏకంగా విజయ్ సేతుపతి సినిమాలో అవకాశం లభించింది అని తెలియగానే ఎగిరి గంతేసినంత పని చేసిందట. ఇక విజయ్ సేతుపతితో కలిసి నటించే అవకాశం వస్తే, ఖచ్చితంగా తనను తాను నిరూపించుకుంటుందని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ టాలీవుడ్ బ్యూటీకి విజయ్ సేతుపతి సినిమా ఎలాంటి కెరియర్ ను అందిస్తుందో చూడాలి.
విజయ్ సేతుపతి కెరియర్..
కోలీవుడ్లో పలు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన.. తెలుగులో ‘ఉప్పెన’ సినిమాలో విలన్ గా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ.. బిజీగా మారిన విజయ్ సేతుపతి.. అటు హీరోగా కూడా కోలీవుడ్లో సినిమాలు చేస్తూ పేరు సొంతం చేసుకున్నారు. ఇక త్వరలోనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు విజయ్ సేతుపతి. ఎక్కడో దుబాయిలో పనిచేసుకుంటూ జీవితాన్ని కొనసాగించిన ఈయన.. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు అందరి ఫేవరెట్ హీరోగా మారిపోయారు. దీన్ని బట్టి చూస్తే విధి ఎవరిని ఎప్పుడు ఎక్కడికి చేరుస్తుందో చెప్పలేం అని పలువురు సెలబ్రిటీలు కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు.
OTT Web Series:ప్రపంచంలోనే అత్యంత హింసాత్మక వెబ్ సిరీస్ లు.. మీ గుండె జాగ్రత్త!