Mamta Kulkarni.. ఈ మధ్యకాలంలో అయితే బాలీవుడ్ లో కాంట్రవర్సీ క్వీన్ గా కంగనా రనౌత్ (Kangana Ranaut) పేరు మారుమ్రోగుతోంది. కానీ ఒకప్పుడు తన నోటి దురుసు మాటలతో, చలాకీతనంతో విమర్శకురాలిగా భారీ పేరు సొంతం చేసుకుంది మమతా కులకర్ణి (Mamta Kulkarni).. ముఖ్యంగా 90లలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న మమతా కులకర్ణి.. పెద్ద స్టార్లతో గొడవ పడేందుకు కూడా వెనకాడే వారు కాదు. బాగా స్థిరపడిన కుటుంబం నుంచి వచ్చిన మమతాకి దూకుడు ఎక్కువ అని అప్పట్లో గుసగుసలు కూడా వినిపించేవి. నిజానికి ఆమె ఎంత అందంగా ఉంటుందో.. నోరు విప్పితే ఎదుటివారు భయపడాల్సిందే అనేంతలా పేరు సొంతం చేసుకుంది మమత కులకర్ణి.
మమత కులకర్ణికి స్టార్ హీరోల నుండి ఘోర అవమానం..
ఇకపోతే ఇలాంటి మమతా కులకర్ణికే బాలీవుడ్ స్టార్ హీరోల నుండి అవమానం జరిగిందని తెలిసి ఆమె అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. అప్పట్లో కరణ్ అర్జున్ (Karan Arjun) మూవీ షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ (Salman Khan) షారుక్ ఖాన్ (Shahrukh khan) వంటి స్టార్ హీరోలు ఆమెను అవమానపరిచినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మమతా కులకర్ణి ఇదే విషయంపై స్పందిస్తూ.. అసలు విషయాన్ని వెల్లడించింది. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మమతా కులకర్ణి తో.. గతంలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోలతోనే గొడవ పెట్టుకుందని, వారిపై అరిచేసిందని పుకార్లు వచ్చాయి. దీనికి మీ సమాధానం ఏమిటని? ప్రశ్నించారు యాంకర్. దీనికి ఆమె ఆసక్తికర సమాధానం తెలిపింది. “షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ల కరణ్ అర్జున్ సినిమాలో నేను హీరోయిన్గా నటించింది. షూటింగ్ సమయంలో వాళ్ళు ఇద్దరూ నన్ను చూసి చిరునవ్వు నవ్వుకున్నారు. ఆ తరువాత నా ముఖం మీదే తలుపులు వేశారు అని ” వెల్లడించింది.
అసలు విషయం చెప్పి క్లారిటీ ఇచ్చిన మమతా కులకర్ణి..
ఇక అంతే కాదు “ఆప్ కి అదాలత్” అనే కార్యక్రమంలో కూడా రజత్ శర్మ (Rajath Sharma) ఇదే విషయంపై మమతాను ప్రశ్నించారు. షూటింగ్ సమయంలో మీరు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లపై అరిచారట కదా.. నిజమేనా? అని ప్రశ్నించగా.. దానికి ఆమె మాట్లాడుతూ..’ ఇది నిజం కాదు. వారే నా ముఖం మీద తలుపులు వేశారు. ఒక డాన్స్ సీక్వెన్స్ కోసం చిన్ని ప్రకాష్ మాస్టర్ నన్ను పిలిచి వివరించారు. మాస్టర్ ను కలిసేందుకు వెళ్లేటప్పుడు మేడ నుంచి కిందికి దిగివస్తూ నన్ను చూసిన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ చిన్న చిరునవ్వు నవ్వుకున్నారు. మాస్టర్ ఈ ప్రత్యేకమైన స్టెప్ నువ్వే సోలోగా చేస్తావని చెప్పారు. ఆ మరుసటి రోజు డాన్స్ సీక్వెన్స్ షూట్లో నేను మాత్రమే పాల్గొన్నాను. అయితే సల్మాన్, షారుక్ ఇద్దరూ కూడా వెనుక నుండి నన్ను చూస్తుండడం నేను గమనించాను. వాళ్లు మళ్లీ నవ్వుకున్నారు. ఆ తర్వాత వాళ్లపైనే షార్ట్ చిత్రీకరించాల్సి ఉంది. 5,000 మంది మధ్యలో మోకాళ్లపై నడవాలి వాళ్ళు. ఎన్నో రీ టేకులు కూడా తీసుకున్నారు. సాయంత్రం అయ్యేసరికి డైరెక్టర్ విసుగెత్తి ప్యాకప్ అంటూ గట్టిగా అరిచారు. ఇక తర్వాత ఎవరికి వారు గదులకు వెళ్లిపోయాము.ఇక తర్వాత ఒకరోజు సాయంత్రం వారు నాతో ఆడుకున్నారని నాకు తెలుసు. కొరియోగ్రాఫర్ కూడా నాకు అన్ని స్టెప్పులు కేటాయించమని చెప్పే అవకాశం నేను వారికి ఇవ్వకూడదు అనుకున్నాను. అందుకే వారు కొరియోగ్రాఫర్ దగ్గరికి పరిగెత్తి వెళుతుంటే, నేను కూడా వారి వెనకాలే పరిగెత్తాను. కానీ నేను దగ్గరకు రాగానే సల్మాన్ నన్ను ఆపి నా ముఖం మీద తలుపు మూసేశాడు. ఇదే అక్కడ జరిగింది” అంటూ అసలు విషయాన్నీ తెలిపింది మమతా కులకర్ణి అయితే వారిద్దరూ కూడా నన్ను ఆట పట్టించడానికి అలా చేశారు అంటూ వివరణ ఇచ్చింది. ఇకపోతే 1995లో విడుదలైన కరణ్ అర్జున్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, కాజోల్, మమత కులకర్ణి, రాఖీ కీలక పాత్రలు పోషించారు.