Birth Certificate: దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే మన మిత్ర పేరుతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ సేవలను జనవరి 30 న ప్రారంభించారు. మొత్తం 161 పౌర సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వార అందుబాటులోకి రాగా, అందులో ప్రధానంగా ఈ సేవ మాత్రం ప్రజల తిప్పలకు చెక్ పెట్టిందని చెప్పవచ్చు.
ప్రతి ఒక్కరికీ బర్త్ డే సర్టిఫికెట్ అవసరం. ఈ సర్టిఫికెట్ ఉంటేనే, జననం నమోదు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి అవుతుంది. అందుకే ఇప్పుడే పుట్టే ప్రతి బిడ్డకు బర్త్ డే సర్టిఫికెట్ ప్రాధాన్యత సంతరించుకుంది. పాఠశాలలో చేర్పించే సమయంలో, రేషన్ కార్డులో బిడ్డ పేరు నమోదు చేసేందుకు, ఆధార్ కార్డు పొందేందుకు బర్త్ డే సర్టిఫికెట్ తప్పనిసరి. అందుకే అప్పుడే పుట్టిన బిడ్డ బర్త్ డే సర్టిఫికెట్ ను పొందేందుకు గతంలో ఆయా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే.
బిడ్డ జననం వివరాలు తెలిపి, దరఖాస్తు పూరించి ఆ వివరాలను ముందుగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కానీ, సచివాలయంలో కానీ అందించాలి. ఆ తర్వాత కొద్ది రోజులకు సర్టిఫికెట్ పొందే అవకాశం ఉంటుంది. అందుకోసం కొందరు అధికారులు కార్యాలయాల చుట్టూ.. ప్రజలను కాళ్లరిగేలా తిప్పించుకున్న ఘటనలు కూడ అక్కడక్కడా గతంలో చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇలాంటి తిప్పలకు చెక్ పెట్టింది.
Also Read: Tirupati Crime: శ్రీవారిని దర్శించుకొని మరీ.. తిరుమలలో దంపతుల ఆత్మహత్య
ప్రస్తుతం ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమం ద్వార పౌర సేవలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, బర్త్ డే సర్టిఫికెట్స్ పొందే పద్దతిని సులువుతరం చేసింది. పారదర్శక పాలన ప్రజలకు అందించేందుకు మన మిత్ర పేరుతో ఈ సేవలు అందుబాటులోకి రాగా.. 9552300009 నెంబర్ ను సేవలు అందించేందుకు కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడే పుట్టిన బిడ్డకు బర్త్ డే సర్టిఫికెట్ పొందాలంటే, ఇప్పుడు ఇంటి నుండి కాలు బయటకు పెట్టాల్సిన అవసరం లేదట. జస్ట్ మన మిత్ర నెంబర్ కు Hi అని మెసేజ్ పెడితే క్షణాల్లో బర్త్ సర్టిఫికేట్ పొందవచ్చు. మెసేజ్ చేసిన అనంతరం వివరాలు నమోదు చేస్తే చాలు.. క్షణాల్లో సర్టిఫికెట్ మీ ముందు ఉంటుంది. ఈ సేవలను సద్వినియోగం చేసుకోండంటూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.